- వచ్చే 7 నెలల్లో 68.64 లక్షల పాసుపుస్తకాల జారీ
- ఈ నెల వరకూ 32.22 లక్షల పుస్తకాలు పంపిణీ
- పట్టాదారు పాసుపుస్తకాలకు టెక్నాలజీ
- రక్షణ కవచం
- పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ
- డీఎస్సీపై టీచర్లు తిరగబడినా గొడ్డలి పార్టీకి బుద్దిరాలేదు
- రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు తామే కట్టానని కలలు కంటున్నారు
- కలిదిండిలో మీ భూమి-మీ హక్కు సభలో సీఎం చంద్రబాబు
కైకలూరు (చైతన్యరథం): గత పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూమి రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ రికార్డుల రిఫార్మ్స్ 2026 తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే అజెండాగా కూటమి ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. 2027 నాటికి రీ సర్వే ప్రక్రియను పూర్తిచేసి రైతులు, భూ యజమానులకు రాజము ద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేస్తామని తెలిపా రు. కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో మీ భూమి-మీ హక్కు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యా రు. ఈకేవైసీ పూర్తి చేసిన అనంతరం నల్లజర్ల దుర్గా భవానీ అనే మహిళా రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాన్ని సీఎం జారీ చేశారు. రీసర్వే ప్రక్రియకు సంబంధించి కలిదిండిలో నిర్వహించిన గ్రామసభకు హాజరైనట్టుగా సీఎం రిజిస్టర్లో సంత కం చేశారు. అనంతరం ప్రజలు, రైతులను ఉద్దేశించి ప్రసంగిం చారు. రాష్ట్రం, కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ వేగం తో అభివృద్ధి చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు ఇచ్చిన భూమిని 22ఏలో పెడితే దానిని పరిష్కరించి వారికి పట్టాలు ఇచ్చాం. మీ భూమి మీ హక్కు దానిపై ఇతరులు పెత్తనం చేయడానికి వీల్లేదు. పాసు పుస్తకాలపై గత పాలకులు ఫొటోలు ఎలా వేసుకుంటారు. 2019-24 మధ్య గత పాలకులు చేసిన విధ్వంసం కారణంగా రెవెన్యూ రికార్డులు ధ్వంసం అయ్యా యి. వారికి ఇష్టం లేని వ్యక్తుల భూములు, ఆస్తులను డిజిటల్‌గా 22ఏలో పెట్టేసి వివాదాస్పదం చేశారు. 2024లో అధికారంలోకి రాగానే ఎక్కడికి వెళ్లినా భారీఎత్తున భూ ఫిర్యాదులు అందాయి. అప్పుడే వీటన్నిటినీ పరిష్కరించాలని నిశ్చయించుకున్నాం. ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఆస్తుల వివరాలు ట్యాంపర్ చేయకుండా భద్రత
గత పాలకులు బటన్ నొక్కటం, పరదాల చాటున రావటం, సభలు పెట్టి చెట్లు నరికేశారు. సమస్యలు పట్టించుకోని వారికి ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ప్రజల సమస్యలు తెలు సుకోవాలనే ప్రతినెలా సమావేశాల ద్వారా వారిని కలుస్తున్నాం. కరెన్సీకి ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను పట్టాదారు పాస్ పుస్తకాలకు కూడా అమలు చేస్తున్నాం. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పిం చాం. క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతికపరమైన భద్రతా ఫీచర్ల ను ఏర్పాటు చేశాం. 32.32 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను ఇప్పటివరకూ రైతులకు, భూ యజమానులకు అందించాం. వచ్చే ఏడు నెలల్లో 9365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68.64 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
రెవెన్యూ సంస్కరణలతో రైతులకు ప్రయోజనాలు
ఇప్పటివరకూ 41 వేల ఎకరాల మేర భూ సమస్యలు క్లియర్ చేశాం. దీని ద్వారా 1.27 లక్షల మందికి పైగా రైతులు, పరిశ్ర మలు, ప్రజలకు ప్రయోజన కలిగింది. 1.36 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశాం. ప్రతీ రైతుకు, భూ యజమానికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసే వరకూ విశ్రమిం చం. భూమి తమదైనా వేర్వేరు ఇబ్బందులతో రైతులు, భూ యజ మానులు ఇప్పటివరకూ సమస్యలు ఎదుర్కొన్నారు. 1బీ, అడం గల్, డీకేటీ, ఏఆర్సీ, ఇనామ్, సీలింగ్ లాంటి పాత భూమి రికా ర్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టాం. లింక్ డాక్యుమెంట్లన్నీ ఆన్ లైన్ ద్వారా అందిస్తాం. భూ రికార్డులను చట్టబద్ధంగా నవీకరించి ధృవీకరించే ప్రక్రియను పకడ్బందీగా చేస్తున్నాం. 9 లక్షల మంది కి ఇప్పటివరకూ ఆటో మ్యూటేషన్ సౌకర్యం కల్పించాం. రీసర్వే ప్రక్రియను రైతుల సమక్షంలోనే చేసి ఈకేవైసీ తీసుకున్న తర్వాతే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నాం. గ్రామసభ నిర్వహించి పూర్తి పారదర్శకంగా వాటిని పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని వివరించారు.
భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ఉద్దేశం
రాష్ట్రంలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలన్నదే మా ఉద్దేశం. వివాదాలు తగ్గి లావాదేవీలు పెరుగుతాయి. ఐటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అనుసంధానించి ప్రజలకు సులభంగా పౌరసేవలు అందేలా చర్యలు చేపట్టాం. కొల్లేరు వద్ద తాగునీటి సమస్యను పరిష్కరించేలా రూ.36 కోట్లను కైకలూరుకు మంజూరు చేశాం. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పదేపదే మరమ్మతులు వచ్చే రహదారులకు కూడా శాశ్వ త పరిష్కారం ఉండేలా సిమెంట్ రోడ్లు వేయాలని ఆలోచన చేస్తున్నాం. గత పాలనలో గోతులు పడిన రోడ్ల గురించి ప్రశ్నిస్తే బటన్ నొక్కామని సమాధానం ఇచ్చేవారు. గత పాలన తాలూకు విధ్వంసపు గడ్డు రోజులను అధిగమించి క్రమంగా అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. 2019-24 మధ్య రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైంది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం లాంటి పరిస్థి తులు ఆక్వా రంగాన్ని దెబ్బతీశాయి. కానీ కూటమి వచ్చాక ఆక్వా కు రూ.1.50కు యూనిట్ చొప్పున రాయితీ విద్యుత్‌ను జోన్‌తో నిమిత్తం లేకుండా ఇస్తున్నాం. ప్రభుత్వానికి రూ.1150 కోట్ల అదనపు భారం పడినా.. దేశానికి ఆదాయం వచ్చేలా చేస్తున్న రైతుల కోసం దీనిని భరిస్తున్నాం. నాన్ ఆక్వాజోన్ పరిధిలోని 12,500 మంది రైతులకు కూడా కొత్తగా ఈ రాయితీ విద్యుత్ అమలు అవుతుందని వెల్లడించారు.
పరామర్శల పేరుతో గొడ్డలి పార్టీ నానాయాగీ
ఓ దౌర్భాగ్యపు పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. గొడ్డలి పార్టీ వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. నక్సల్స్ నాపై క్లైమోర్ మైన్స్ పేల్చినా కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లో కొనసాగు తున్నాను. రాయలసీమలో ఫ్యాక్షన్, హైదరాబాద్‌లో మత విద్వేషా లను కూడా సమర్థంగా నియంత్రించాం. ఆ తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి జరిగి సంపద పెరిగింది. అంతర్జాతీయ స్థాయి కంపెనీ లు వచ్చాయి. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ వల్ల గంజాయి, రౌడీ బ్యాచ్ కారణంగా అరాచకాలు జరిగాయి. మేం అధికారంలోకి వస్తూనే గంజాయి పంటను నిర్మూలించాం. దేవరపల్లి వద్ద పొగాకు రైతుల పరామర్శకు వెళ్లి నానా యాగీ చేశారు. స్వైరవిహారం చేశారు. రోడ్లపై ప్రమాదకరంగా మోటారుసైకిళ్లతో సర్కస్ చేస్తూ భయపె డుతున్నారు. రైతుల పొగాకు మొత్తం తొక్కించారు. పొగాకు కిలో కి రూ.10 చొప్పున సబ్సిడీ ఇవ్వటంతో పాటు బ్యారన్ కు రూ.50 వేల రుణం ఇప్పించేలా కేంద్రంతో మాట్లాడాం. తప్పుచేస్తే మా పార్టీ వ్యక్తులైనా చర్యలు తీసుకుంటున్నాం. గుంటూరులో ఓ మహి ళపై అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నేతను సస్పెండ్ చేశాం. కేసు పెట్టి విచారణ చేస్తున్నాం. శ్రీకాకుళంలో ఓ మాజీ మంత్రి కొడుకు బైక్‌తో గుద్ది ఓ వ్యక్తిని చంపేస్తే అతన్ని పరామర్శించ డానికి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వెళ్లి అరాచకం చేశారు. ప్రధాన మంత్రి పర్యటన ఓ వైపు ఉంటే రోడ్లపై గంటలు గంటలు ర్యాలీ చేశారు. ఓ మహిళా పోలీసు అధికారిపై దాడి చేశారు. తిరిగి పోలీ సులపై నెపం వేశారని మండిపడ్డారు.
యువతను కించపరిచేలా గొడ్డలి పార్టీ చర్యలు
మెగా డీఎస్సీ ద్వారా 15 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తే దానిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. పూర్తి మెరిట్‌తో ఉద్యోగాలు సంపాదించిన యువతను కించ పరిచేలా గొడ్డలి పార్టీ వ్యవహరి స్తోంది. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపరు లీక్ అయితే.. ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేయాలని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన టీచర్లు రోడ్లపైకి వచ్చి ర్యాలీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతామని వాళ్లు హెచ్చరించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా టీచర్లు ఆందోళన చేశా రు. ఇంత చేసినా ఆ పార్టీకి బుద్దిరావటం లేదు. ఇంకా ఆందోళన చేస్తాం, రోడ్లపై స్వైరవిహారం చేస్తామంటున్నారు. రప్పా రప్పా అంటూ గొడ్డలి పార్టీ రౌడీలు, గంజాయి బ్యాచ్‌లు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కడి తే అది నేనే కట్టాను అంటున్నాడు. పోలవరం పూర్తి అయితే అది కూడా నేనే చేశానంటాడు. అమరావతి నిర్మిస్తే అది కూడా నేనే అంటాడు. అభివృద్ధి పనులు పూర్తిచేసి మేం ఆనందిస్తుంటే.. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు విధ్వంసం చేసేసి ఆరోపణలు చేస్తున్నాడు. ఎవరు ప్రజలకు ఇబ్బంది కలిగించినా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అనంతరం రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సభలో మంత్రులు కొలుసు పార్ధసారథి, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సీఎస్ సాయిప్రసాద్, సీసీఎస్ఏ జయలక్ష్మి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.











