- 2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం
- వివిధ రంగాల్లో పెరుగుదలపై ఆర్థిక నివేదిక
- విద్యుత్ వినియోగంలో 13.7, ఖనిజాల్లో 32.8 శాతం
- గణనీయంగా పెరిగిన దేశీయ, విదేశీ పర్యాటకులు
- 15 శాతం వృద్ధిరేటు సాధించేలా సమగ్ర ప్రణాళికలు
- సామాన్యుడిపై ధరల భారం లేకుండా కార్యాచరణ
- స్థూల ఉత్పత్తి పడిపోకుండా సమన్వయం చేసుకోవాలి
- జీఎస్డీపీ, నెలవారీ ఆర్థిక నివేదికపై సీఎం సూచనలు
- ఆర్థిక పరిస్థితిపై అధికారులకు దిశానిర్దేశం
అమరావతి(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని జూలై 2026 నెలవారీ ఆర్థిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు మెరుగ్గా నమోదు అవుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 2023-24లో 6.5 శాతం నమోదు చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతానికి పెరిగింది. రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయ మైన వృద్ధి నమోదు అవుతున్నట్టు నెలవారీ ఆర్థిక నివేదిక పేర్కొం ది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా విభాగం అధికారులు 2026 జూలై ఆర్థిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. 2026 జూన్‌తో పోలిస్తే పారిశ్రా మిక ఉత్పత్తి 8.2 శాతం మేర పెరిగిందని నివేదిక పేర్కొంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలానికి సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి 89,383 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో 304 శాతం మేర పెరు గుదల రికార్డు అయినట్టు నివేదిక పేర్కొంది. అటు కూరగాయల ఉత్పత్తిలోనూ 44.8 శాతం మేర పెరుగుదల ఉన్నట్టు ప్రణాళికా విభాగం స్పష్టం చేసింది. పశుసంవర్ధక శాఖలో మాంసం ఉత్పత్తి 9.6 శాతం, గుడ్ల ఉత్పత్తి 5.1 శాతం, సముద్రపు రొయ్యల్లో 17 శాతం వృద్ధిని సాధించాయి. సేవా రంగంలో ఐటీì, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ ఎగుమతుల్లో రూ.16,322 కోట్లతో 10.5 శాతం మేర వృద్ధి నమోదు అయింది. ఎస్టీపీఐ ఎగుమతులు 32.2 శాతం మేర పెరిగాయి. అలాగే వాణిజ్య వాహనాల కొనుగోళ్లు 51.6 శాతం వృద్ధిని కనబరిచింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెక్నాలజీ ఇంట ìగ్రేషన్తో జీఎస్టీ పన్ను వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ.13,282 కోట్లకు చేరాయి. ఖనిజాల్లో 17.9 శాతం, విద్యుత్ వినియోగం 22.2 శాతం మేర పెరిగింది.
పర్యాటకం, పెట్టుబడులు
జూలై మాసానికి సంబంధించి పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దేశీయంగా 3.10 కోట్ల మంది, 35,951 మంది విదేశీ టూరిస్టులు రాష్ట్రానికి వచ్చారని జూలై నెల ఆర్థిక నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కూడా ఆశాజనకంగా ఉంది. రూ.2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల పెట్టుబడులు గ్రౌండింగ్‌తో 75.4 శాతం మేర, రూ.60 వేల కోట్ల మేర ఎంఎసఎంఈ రంగ పెట్టుబడులు 73.6 వృద్ధిని నమోదు చేశాయి. పన్ను, పన్నేతర ఆదాయాల్లో గణనీ యంగా వృద్ధి నమోదు అయింది. 2025-26 రెండో త్రైమాసి కంలో వ్యవసాయ రంగం 13.5 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక రంగం 10.6 శాతం మేర, సేవల రంగం 9.9 శాతం వృద్ధితో ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి. ఫలితంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది.
ఎల్‌నినో సంక్షోభంలో లక్ష్యాల్ని సాధించాలి
ఎల్‌నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికా విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశా రు. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ వివిధ అంశాలను పరి గణనలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. వాణి జ్య పన్నుల శాఖ తరహాలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ టెక్నాల జీని సమర్థంగా అనుసంధానించి లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉందని కృష్ణా నదిలో ప్రవాహాలు లేని కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు ఇంకా పూర్తిగా నిండలేదని.. గోదావరికి వచ్చిన వరద ప్రవాహాలను మళ్లించి కృష్ణా డెల్టాకు నీరిచ్చామని పేర్కొన్నారు. భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నా యని.. ఈ నేపథ్యంలో స్థూల ఉత్పత్తి పడిపోకుండా వివిధ శాఖల తో సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపట్టాలని సూచించారు. సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి లోటుపాట్లను సరిచేసుకో వాలన్నారు. ప్రతీ ప్రభుత్వ శాఖ అత్యున్నత స్థాయి లక్ష్యాలను చేరుకునేలా వనరుల నిర్వహణ చేపట్టాలన్నారు.
నిర్ధిష్టమైన ప్రమాణాలను అనుసరించి ఫలితాలు వచ్చేలా చూడాలని దిశా నిర్దేశం చేశారు. రూపోందించే ప్రతీ ప్రణాళికా రాష్ట్ర వృద్ధిరేటును పెంచేలా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలపై ఎలాంటి ధరల భారం పడకుండా చూడాలని సూచించారు. నీటి లభ్యత, ఉత్పత్తు లకు విలువ జోడింపు లాంటి అంశాలపై సూచనాత్మక కంటిజెన్సీ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఏపీ 15 శాతం వృద్ధిరేటు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని సూచించా రు. అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి కావాల్సిన ఉత్పత్తులపై ప్రభావం లేకుండా చూడాలన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండ లాల వారీగా నివేదికలు ఇస్తే లక్ష్యాల సాధన సులువు అవుతుంద ని తెలిపారు. ఈ సమీక్షలో ఆర్థిక, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, జాయింట్ సెక్రటరీ శాంతి ప్రియా పాండే, ప్రణాళికా విభాగం డైరెక్టర్ బి.గోపాల్, ఏపీ ఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్ అలపర్తి తదితరులు పాల్గొన్నారు.















