- డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు హాజరు
- పోలీసుస్టేషన్ల పనితీరు, కేసులపై లోతైన విశ్లేషణ
- క్షేత్రస్థాయి నివేదికలతో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 03:30 గంటలకు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ హించనున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీసు వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను ఈ సమీక్షలో భాగస్వామ్యులను చేస్తున్నా రు. డీజీపీ మొదలుకుని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు మొత్తంగా 1,300 మంది అధికారులు ఈ సమా వేశానికి హాజరుకానున్నారు. శాంతిభద్రతలు, మహిళలు, చిన్నా రులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్, సోషల్‌మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. పోలీసుస్టేషన్ల పనితీరుపై లోతైన విశ్లేషణ చేయనున్నారు. వివిధ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాలపై తన వద్ద ఉన్న రిపోర్టులను నేరుగా అధికారుల ముందే బయటపెట్టనున్నా రు. రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీనవర్గాల రక్షణకు ప్రథమ ప్రాధా న్యం ఇవ్వాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్య క్షంగా హాజరుకానుండగా జిల్లాల్లోని మిగిలిన అధికారులు, ఎస్‌హెచఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనబోతున్నారు.















