- ఆరు అంశాల్లో టీటీడీ కార్యకలాపాల పునర్వవస్థీకరణ
- రాష్ట్రంలో 5 వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం లక్ష్యం
- భక్తుల కోసం రూ.2 లక్షల బీమా అమలు చేస్తున్నాం
- విద్య, వైద్యరంగాల్లో శ్రీవారి సేవకులకు కార్యాచరణ
- తిరుమల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
- భక్తుల అనుభూతి పెంచేలా ఎక్స్ పీరియన్స్ సెంటర్
- శ్రీవారి ప్రాశస్త్యం తెలిసేలా ఎస్వీ మ్యూజియం అభివృద్ధి
- భక్తుల రాకపోకలకు 32 ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం
తిరుమల (చైతన్యరథం): తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా, ఆధ్యాత్మికతకు ప్రపంచస్థాయి నమూనాగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తిరుమలలో భక్తులకు మెరుగైన అనుభూతిని అందించ డంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మికత, సేవాభావం, ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తామని చెప్పారు. తిరుమ ల కొండల్లో 89.5 శాతం గ్రీన్ కవర్ ఉందని, దీన్ని మరింత పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్, ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియం, రిలయన్స్ ఫౌండేషన్-భారత్ బయోటెక్ సంస్థలు అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఏర్పా టు చేసిన పిలిగ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో శ్రీవారికి నిర్వహిం చే నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు, తిరుమలలోని వివిధ ప్రాంతాలను త్రీడీ సాంకేతికత ద్వారా భక్తులు వీక్షించే అవకాశం కల్పించారు. ఆరు డీవీఆర్ వర్చువల్ రియాలిటీ ద్వారా తిరుమల దర్శన అనుభూతిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికీ బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని తెలిపారు. ఎల్బీసీతో కలిసి ఆధార్ ఆధారిత ఆన్లైన్ బీమా అమలు చేయ నున్నట్లు చెప్పారు. దురదృష్టవశాత్తూ తిరుమలలో భక్తుడు మరణి స్తే రూ.2 లక్షల ఆర్థికసాయం అందేలా ఈ బీమా వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 5 వేల దేవాలయాలను శ్రీవాణి ట్రస్టు ద్వారా నిర్మాణం చేపడతామన్నారు. మారిషస్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించాలని కోరుతు న్నారని, దీనిపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు. శ్రీవారి సేవకులను విద్య, వైద్యరంగాల్లోనూ వినియోగించుకునేలా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. ఆరు అంశాల్లో తిరుమల తిరుపతి దేవస్థాన కార్యకలాపాలను పునర్వవస్థీకరిస్తామని స్పష్టం చేశారు.
ఎస్వీ మ్యూజియం ఆధునికీకరణ
గతంలో ఉన్న ఎస్వీ మ్యూజియాన్ని ఆధునికీకరించి పునః ప్రారంభించారు. శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీవారి పరిణయం తదితర అంశాలను భక్తులకు సుల భంగా అర్థమయ్యే రీతిలో ప్రదర్శించేలా టీటీడీ ఈ మ్యూజి యా న్ని సిద్ధం చేసింది. టీసీఎస్ ట్రస్ట్ రూ.104 కోట్లతో మ్యూజి యాన్ని అభివృద్ధి చేసింది. శ్రీకృష్ణదేవరాయలు సహా వివిధ రాజులు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నమూనాలు, వివిధ కాలాలకు చెందిన చారిత్రక వస్తువులు, స్వామివారికి అలంకరిం చే కిరీటాలు, ఆభరణాల త్రీడీ నమూనాలను మ్యూజియంలో ఏర్పాటు చేశారు. పానోరమిక్ స్క్రీన్పై ఏఐ వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాలను సీఎం చంద్రబాబు తిలకించారు. శ్రీవారి సేవకోసం, స్వామి వారిని కీర్తించేందుకు ఆనాటి సంగీత కారులు వినియోగించిన వాయిద్య పరికరాలను కూడా మ్యూజి యంలో ఆసక్తిగా పరిశీలించారు.
32 ఎలక్ట్రిక్ బస్సులు జెండా ఊపి ప్రారంభం
తిరుమలలో భక్తుల రాకపోకలకు వీలుగా రిలయన్స్ ఫౌండేష న్, భారత్ బయోటెక్ సంస్థలు అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సుల ను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. రిలయన్స్ ఈ-మోబిలిటీ సీఈవో నితిన్ సేత్, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా టీటీడీ సభ్యులతో కలిసి నారాయణగిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకూ ఎలక్ట్రిక్ బస్సులో సీఎం ప్రయాణించారు.












