ఎలాంటి ఎరువు లు, కెమికల్స్ వాడకుండా ప్రకృతి సాగు చేయడం చాలా ఆనం దాన్నిస్తోంది. బీజామృతం.. జీవామృతాలతో సాగు చేస్తున్నారు. ప్రకృతి సాగులో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నారు. ప్రధాని లక్ష్యాలకు అనుగుణంగా ఏపీలో ప్రకృతి సాగు జరుగుతోంది. ప్రకృతిసాగుతో ప్రజారోగ్యం బాగుంటుంది.. భూసారం పెరుగుతుంది. భూసారం బాగుంటే చక్కటి పంట వస్తుంది… చక్కటి పంట వస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. పెద్దఎత్తున ప్రకృతి సాగు చేసేలా కృషి చేస్తున్న సీఎం చంద్రబాబును అభినందించారు. ప్రకృతి సాగుకు చంద్రబాబు ఇస్తున్న త్రోత్సాహంతో దేశంలో ఏపీ నెంబర్-1 స్థానంలో ఉంది. రైతు జానకీరామ్ మాట్లాడుతూ నేచురల్ ఫార్మింగ్ పద్దతిలో ఎకరా వరి సాగుకు కేవలం రూ.7 వేలు మాత్రమే ఖర్చు అవుతోందని చెప్పారు. అదే రసాయన ఎరువులతో సాగు చేస్తే ఎకరాకు రూ.25 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. పెద్దఎత్తున సాగు ఖర్చులు తగ్గుతూ రైతుకు మేలు జరుగుతుంది. ప్రకృతి సాగుతో పండించిన ఉత్పత్తికి మార్కెట్టులో కూడా చక్కటి ధర లభిస్తోందని వివరించారు. అంతకముందు బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళు లర్పించారు.














