చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
November 13, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడమే లక్ష్యం
  • ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలకు వారు బలికాకూడదు
  • రాయితీల కోసం ఎస్క్రో ఖాతాలు తెరుస్తున్నాం
  • వికేంద్రీకరణ ప్రణాళికలతో అభివృద్ధి సంకల్పం
  • పెట్టుబడుల సాధనలోనే కాదు.. గ్రౌండింగ్లోనూ వేగమే
  • అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మాణం
  • పారిశ్రామికవేత్తలు రెండో ఎంపికగా ఎంచుకోవాలి
  • సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు

విశాఖలో రెండురోజుల పాటు జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు గురువారం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సదస్సులో సీఎం చంద్రబాబు కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. వేగవంతమైన అభివృద్ధికి జాతీయ స్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టం చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడుల రక్షణ చట్టం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రగతిని వివరిస్తూ పెట్టుబడిదారులకు ప్రభుత్వంపై నమ్మకం, ఇచ్చిన హామీల అమలుపై భరోసా కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పరిశ్రమలకు రియల్ టైమ్లో అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

 

విశాఖపట్నం(చైతన్యరథం): వేగవంతమైన అభివృద్ధికి జాతీయ స్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. విశాఖలో గురువారం రెండురోజు ల పాటు జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరైన వివిధ దేశాల పారిశ్రామిక ప్రతినిధులు, రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. అలాగే రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరుగు తోన్న అభివృద్ధిని పారిశ్రామికవేత్తలకు వివరించారు. పెట్టుబడుల కు ఉన్న అవకాశాలను తెలియజేశారు.
ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాలకు చెందిన పెట్టుబడులకు అవకాశం ఉందో ప్రజెంట్ చేశారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి జరిగిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పెట్టుబడుల భద్రతకు సంబంధించి కీలక ప్రతి పాదనలు చేశారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల్లో నమ్మ కం,
ఉత్సాహం కలిగించేందుకు పారిశ్రామిక రాయితీలకు సంబం ధించి ఎస్క్రో ఖాతాను తెరుస్తున్నామని చెప్పారు.

దీంతో పాటు పెట్టుబడుల రక్షణ చట్టం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో పెట్టుబడుల చట్టం చేసి కేంద్రానికి పంపుతామని… దాన్ని కేంద్రం ఆమోదించాలని కోరారు. జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడుల భద్రతా చట్టాన్ని చేస్తే భారతదేశ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలకు పెట్టుబడిదారులు బలికాకూడదని, వచ్చే పెట్టుబడులకు శాశ్వత భరోసా కల్పించేందుకు ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరమన్నారు. పెట్టుబడిదారులకు ప్రభు త్వంపై నమ్మకం, ఇచ్చిన హామీల అమలుపై భరోసా కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జన్ విశ్వాస్ పిలుపునకు అనుగుణంగా ఏపీలో పాలన సాగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పరిశ్రమలకు రియల్ టైమ్లో అనుమతులు మంజూరు చేస్తున్నా మని చెప్పారు. పెట్టుబడులకు సంబంధించిన ప్రక్రియల్లో జాప్యం లేకుండా వేగంతో అనుమతులు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తు న్నామని వివరించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూమి కేటా యింపులు, ప్రోత్సాహకాలను వేగంగా అందిస్తున్నామని తెలిపారు. ఏపీలో ఈ విధానం అమలుకు కియా కార్ల పరిశ్రమ ఒక ఉదాహ రణగా పేర్కొన్నారు. ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కేవలం 36 రోజు ల్లోనే అనుమతులు మంజూరు చేసి భూమి కేటాయించామని, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ కూడా 19 నెలల్లోనే సిద్ధమైందని… ఇది ప్రారం భోత్సవానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.

నమ్మకంతో పెట్టుబడులు…

ఈ సదస్సులో వచ్చే పెట్టుబడులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రా నికి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్టువుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతా ద్వారా అందించడం వల్ల వాటి చెల్లింపుల్లో పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి భవిష్య త్తులో ప్రపంచవ్యాప్తంగా కీలకంగా మారనున్న సాంకేతిక, పారిశ్రా మిక రంగాలను ప్రాధాన్యంగా తీసుకున్నామని చంద్రబాబు వివ రించారు. రేర్ ఎర్త్ మాగ్నెట్స్, స్టీల్ ఉత్పత్తి, సోలార్ వేఫర్లు, సౌర విద్యుత్తు, బ్యాటరీ ఎనర్జీ రంగాల్లో పెద్దఎత్తున అవకాశాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. క్రిటికల్ మినరల్ మిషన్, స్టీల్ పాలసీ, సోలార్ మిషన్, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, అంతరిక్ష రంగానికి స్పేస్ విజన్, సెమీకండక్టర్ మిషన్, లాజిస్టిక్స్ పాలసీ, క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, మారిటైమ్ రంగాల అభివృ ద్ధికి కార్యాచరణ చేపట్టామని చెప్పారు.

అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయడంతో పాటు, క్వాంటం పరికరాలను మేడ్ ఇన్ అమరావతి బ్రాండుతో తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పౌర అవసరాలు, రక్షణ రంగ అవసరాలకు ఉపయోగపడే డ్రోన్ల తయారీ కోసం ప్రత్యేకంగా డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే మారుమూల ప్రాంతా లకు డ్రోన్ల ద్వారా ఔషధాలను రవాణా చేస్తున్నామని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదే శ్ను ప్రపంచ స్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దు తామని చెప్పారు. రాష్ట్రంలో 25 సెక్టోరల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, తిరుపతిని గ్లోబల్ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రం గా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, మౌలిక సదుపా యాలను ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిలో నదుల అనుసంధానం కీలకం

రాష్ట్ర పారిశ్రామిక, వ్యవసాయ, ఆర్థిక అభివృద్ధికి నీటి లభ్యత అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నదు ల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటిని అందించేలా కార్యాచరణ చేపట్టామని వివరించారు. గోదావరి జలాలను రాష్ట్రంలోని వివి ధ ప్రాంతాలకు తరలించడం ద్వారా విశాఖపట్నం, అమరావతి వంటి కీలక నగరాల నీటి అవసరాలను తీర్చే అవకాశం ఉంద న్నారు. గోదావరి కుడి, ఎడమ కాలువల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు, గోదావరి నుంచి కావేరి నదికి నీటిని తరలించే అవకాశాలపైనా దృష్టి సారించామని తెలిపారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా ఐదు రాష్ట్రాల నీటి అవసరాలను తీర్చే అవకాశం ఉందని వివరించారు. విద్యుత్ సరఫరాకు గ్రిడ్ ఉన్నట్లుగానే నీటి సరఫరాకు కూడా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నీటి లభ్యతను పెంచడం ద్వారా వ్యవసాయ రంగానికి భరోసా కల్పించడంతో పాటు, పారిశ్రామిక అవసరాలకు నిరంతరాయంగా నీటిని అం దించవచ్చని చెప్పారు. నదుల అనుసంధానం రాష్ట్ర ఆర్థికాభివృ ద్ధికి, ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధికి దోహదపడు తుందని స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ కలను సాకారం చేయ గలిగేది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని స్పష్టం చేశారు.

అమరావతి నుంచి తిరుపతి వరకు అభివృద్ధి కేంద్రాలు
అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నంతో కూడిన ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఐకానిక్ భవనాలు, అత్యాధునిక మౌలిక సదుపా యాలతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పారిశ్రా మికవేత్తలు అమరావతిని తమ రెండో నివాసంగా మార్చు కోవాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఆపరేషనల్ పోర్టులు, విమానాశ్రయాలు, హైస్పీడ్ రైలు నెట్వర్క్, రహదారి అనుసంధాన వ్యవస్థలు ఉన్నాయని, ఇవి ఏపీని దేశంలో కీలక లాజిస్టిక్స్ కేంద్రంగా నిలబెట్టేందుకు దోహదపడతాయని పేర్కొ న్నారు. పరిశ్రమల
రవాణా, ఎగుమతులు, దిగుమతులకు అనువైన మౌలిక సదుపాయాలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖ పట్నానికి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పెట్టు బడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ పారిశ్రామిక ప్రతిని ధులను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సామా జిక, ఆర్థిక భద్రతతో పాటు సమాన అవకాశాల కల్పనలోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తోందని తెలిపారు. యాక్సెస్ టు ఈక్వా లిటీ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. పేదల జీవన ప్రమాణాలను పెంచడం, వారికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశా రు. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొ న్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని…

అలాగే రెండున్నరేళ్ల కాలంలో చిన్నపాటి గ్యాప్ కూడా లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని… సుస్థిరాభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, బీసీ జనార్దన్రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్, జీఎస్ఆర్ సంస్థ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు, కియా సీఈవో ఇండియా ఎండీ గ్వాంగ్ లీ, సాగర్ డిఫెన్స్ సీఈవో నికుంజ్ పరాశర్ తదితరులు హాజరయ్యారు.

Previous Post

సింగపూర్ సహకారంతో విద్యా శాఖలో సామర్థ్యాల పెంపునకు కృషి

Next Post

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

మరిన్ని వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

November 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

November 13, 2026
మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

November 13, 2026
తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధి

November 13, 2026
ఏపీలో భారీ పెట్టుబడులకు క్లీన్ మాక్స్ ఆసక్తి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో భారీ పెట్టుబడులకు క్లీన్ మాక్స్ ఆసక్తి

November 13, 2026
సీమలో విండ్, సోలార్, బీఈఎస్ ఎస్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

సీమలో విండ్, సోలార్, బీఈఎస్ ఎస్ ప్రాజెక్ట్

November 13, 2026
Next Post
పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

by కార్యకర్త
November 13, 2026

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధి

తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధి

by చైతన్యరధం
November 13, 2026

విశాఖపట్నం(చైతన్యరథం): సైయంట్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ కార్పోరేట్ ఫంక్షన్స్ ప్రతినిధి పీఎనఎస్వీ నరసింహంతో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.