- ఉచిత భూమి, ప్రోత్సాహకాలు ఇచ్చేలా సహకరిస్తాం
- రాజకీయంగా, ఆర్థికంగా వారి భాగస్వామ్యం పెరగాలి
- అన్ని రంగాల్లో ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం
- స్థానిక సంస్థల్లో 50 శాతం పైగా ప్రాతినిధ్యం కల్పించాం
- స్వయం సహాయక సంఘాల విజయాలు దేశానికే ఆదర్శం
- భారీఎత్తున పెట్టుబడులతో మహిళలకు ఉపాధి అవకాశాలు
- పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నాం
- ‘ఉమెన్ అండ్ గ్రోత్’ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖపట్నం(చైతన్యరథం): మహిళలు రాజకీయంగా, ఆర్థికం గా అన్ని రంగాల్లోనూ సమాన భాగస్వాములుగా ఎదిగినప్పుడే నిజ మైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళల భాగస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగా ల్లో 50 శాతానికి మించినప్పుడే తనకు సంపూర్ణ సంతృప్తి కలు గుతుందని పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చేందుకు ప్రత్యేకంగా టెక్ పార్క్ ఏర్పాటు చేసి ఉచితంగా భూమి తో పాటు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటిం చారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన ‘ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట’లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ‘ది ఉమెన్ హూ విల్ షేప్ ది నెక్స్ట్ ఎకానమీ: లీడర్షిప్, క్యాపిటల్, అంబిషన’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, సీఐఐ ప్రతినిధు లు, అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ సభ్యులు, పారిశ్రామికవేత్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
మహిళలకు అవకాశాలిస్తే అద్భుత విజయాలు
మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పుట్టుక నుంచే మహిళల పట్ల వివక్ష చూపే ధోరణి సమాజంలో ఉందని, కొడుకు కుటుంబంతోనే ఉంటాడని, కూతురికి పెళ్లి చేసి పంపించేస్తామనే ఆలోచన మారాలని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థంగా నడిపిం చడం మహిళా సామర్థ్యానికి నిదర్శనమన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయా న్ని గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలకు ప్రాతి నిధ్యం కల్పించామని, అత్యంత విద్యావంతులైన మహిళలకు మేయర్లు, చైర్పర్సన్లు, జెడ్పీ చైర్పర్సన్లుగా అవకాశాలు కల్పిస్తు న్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఐదు స్థానాలు మహిళలకు లభించినప్పటికీ, తాము ఎనిమిది మంది మహిళలకు మేయర్లుగా అవకాశం కల్పించామని చెప్పారు. విశా ఖ మేయర్ కూడా మహిళేనని గుర్తుచేశారు. చట్టసభల్లో మహిళ లకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతిఒక్క రికీ అవకాశాలు కల్పించి అందరూ అభివృద్ధి చెందాలన్నదే తన సంకల్పమని స్పష్టం చేశారు.
డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలు సాధిం చిన విజయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 1.13 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల సభ్యులుగా ఉన్నారని, ఈ సంఘాల వద్ద రూ.30 వేల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘాలు దాదాపు రూ.లక్ష కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయని వెల్లడించారు. డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న రుణాల్లో 99.6 శాతం తిరిగి చెల్లిస్తున్నారని, మహిళలకు ఆర్థిక క్రమశిక్షణ, వ్యాపార నిర్వహణ సామర్థ్యం ఎంతగా ఉన్నాయో ఇది తెలియజేస్తోందన్నారు. మహిళ ల వద్ద రూ.10 ఉంటే దానిని రూ.100గా మార్చగల వ్యాపార నైపుణ్యం వారిలో ఉందని వ్యాఖ్యానించారు.
స్వయం ఏపీ బ్రాండ్‌తో డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్
స్వయం ఏపీ బ్రాండ్‌తో మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మహిళలు కేవలం స్వయం ఉపాధికే పరిమితం కాకుండా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మహిళా శ్రామిక శక్తి 35.8 శాతంగా ఉందని, దీనిని త్వరలోనే 50 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటిం చారు. రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులు మహిళలకు విస్తృతం గా ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు. విశాఖలోని బాండెక్స్ దుస్తుల తయారీ కేంద్రంలో 20 వేల మంది మహిళలు పనిచేస్తున్నారని, గ్లోబల్ టాయ్ పార్క్ ద్వారా మహిళలకు 30 వేల ఉద్యోగాలు కల్పించే అవకాశాలున్నాయని తెలిపారు. కుప్పం, అనంతపురం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పెట్టుబడులు వస్తున్నాయని, ఈ పరిశ్రమల్లో మహిళలకు అధిక సంఖ్యలో ఉద్యో గాలు లభిస్తాయని వివరించారు. మహిళలకు ఆర్థిక భద్రత కల్పిం చడంలో ఆస్తి హక్కులు కీలకమని పేర్కొన్నారు. ఇటీవల విశాఖ పట్నం, విజయవాడ, మంగళగిరిలో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన 60 వేల ఇళ్ల పట్టాలను అందించామని తెలిపారు. మహి ళల పేరుతో ఆస్తులు ఉంటే వాటిని భద్రంగా కాపాడుకుంటారనే నమ్మకం ఉందని, ఇది వారికి సామాజిక భద్రతను కూడా కల్పిస్తుందని చెప్పారు.
సమాజంలో అసమానతలు రూపుమాపాలి
సమాజంలో పేదరికం, ఆర్థిక అసమానతలను తొలగించేం దుకు పీ4, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానాలు ఎంతో ఉపయో గపడుతున్నాయని తెలిపారు. సమాజంలో సంపన్నులుగా ఉన్న 10 శాతం మంది అత్యల్ప ఆదాయ వర్గాల్లోని 20 శాతం కుటుం బాలకు అండగా నిలవాలన్నదే ఎంబీకే విధానం లక్ష్యమని వివ రించారు. కేవలం సంక్షేమ పథకాలతో పేదరికాన్ని నిర్మూలిం చలేమని, పేద కుటుంబాల ఆదాయ మార్గాలను పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని తెలిపారు. లేదంటే పేదరికం శాశ్వతంగా కొనసాగుతుందని, సంపన్నులు మరింత సంపన్నులుగా, పేదలు మరింత పేదలుగా మిగిలిపోయే ప్రమా దం ఉందని హెచ్చరించారు. పేదరికం పెరిగితే సమాజంలో అనేక విపరిణామాలు చోటుచేసుకుంటాయని, యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరికంలో ఉన్న కోటి 10 లక్షల కుటుం బాల అభ్యున్నతికి, ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎసఆర్) ద్వారా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని, కార్పొరేట్ సంస్థలు పీ4 కార్యక్రమంలో భాగ స్వాములై బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని పిలుపు నిచ్చారు. సమాజం నుంచి ప్రయోజనం పొందినవారు తిరిగి సమాజానికి సేవ చేసేలా మహిళలు కూడా ఆదర్శంగా నిలవా లని సూచించారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు దావోస్‌లో అవకాశం
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభు త్వం ప్రత్యేక రాయితీలు అందిస్తోందని తెలిపారు. వచ్చే దావోస్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యేలా ప్రభుత్వం సహకరిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో 54 చేనేత క్లస్టర్లు ఉన్నాయని, వీటిలో అనేక క్లస్టర్లు మహిళా సంఘాల నేతృత్వంలో పనిచేస్తున్నాయని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలు మరింతగా ఎదిగేందుకు అవసర మైన అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అటు ప్రకృతి వ్యవసాయంలోనూ మహిళలు అద్భుత మైన ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. రైతులకు శిక్షణ ఇవ్వడం నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడం వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతోం దని వెల్లడించారు. కుప్పంలో ఇటుకల తయారీ కేంద్రంలో కార్మికురాలిగా పనిచేసిన ఒక మహిళ, తన కష్టం… తెలివి తేటలతో అదే సంస్థకు యజమానిగా ఎదిగారని ఉదాహరిం చారు. ప్రస్తుతం ఆమె ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారని తెలిపారు. సరైన అవకాశాలు, శిక్షణ, ప్రోత్సా హం అందిస్తే మహిళలు ఎంతటి విజయాలైనా సాధించగలరని ఈ ఉదంతం నిరూపిస్తోందని వివరించారు.
మహిళలు టెక్నాలజీని వినియోగించుకోవాలి
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. గతంలో ఐటీ గురించి ఎక్కువగా మాట్లాడేవాడినని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా ప్రస్తా విస్తున్నానని చెప్పారు. డేటా సెంటర్లు, క్వాంటం టెక్నాలజీ, స్పేస్, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పురోగతి సాధించే దిశగా అడుగులు వేస్తోంద న్నారు. తిరుపతిని సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గ్లోబల్ డిజైన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం తో పనిచేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో యుద్ధాల్లో డ్రోన్లు, రోబోటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయని, కర్నూలులో తయారైన డ్రోన్‌ను ఆపరేషన్ సిందూర్‌లోనూ వినియోగించారని గుర్తు చేశారు. స్కైరూట్ వంటి సంస్థలు ఆధునిక సాంకేతికతతో సాధ్య మ య్యే విజయాలను నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు కూడా సాంకేతిక రంగాలపై దృష్టి సారించి అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అలాగే, రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సీఎం ప్రోత్సాహమే భారత్ బయోటెక్‌కు పునాది: సుచిత్ర
సదస్సులో మాట్లాడిన సీఐఐ ప్రెసిడెంట్ సుచిత్రా ఎల్లా సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించారు. హైదరాబా ద్‌కు ఐటీ రంగాన్ని తీసుకురావడంలో, ఆంధ్రప్రదేశ్‌ను బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ముందంజలో నిలపడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. 1996లో హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ సంస్థను స్థాపించడానికి చంద్రబాబు అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తుచేశారు. కరోనా సమయంలో కోట్లాది మంది ప్రాణాలను కాపాడటంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధిలో మహిళలు ముందుండాలని, వారు కేవలం ఉద్యోగులుగా కాకుండా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని రం గాల్లో మహిళల పరివర్తన, సాధికారత మరింత వేగంగా జరగా ల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు మూలధనం, మార్కెట్ అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, నాయకత్వ శిక్షణ అందించడం ద్వారా భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను నిర్మించే శక్తిగా వారిని తీర్చిదిద్దాలన్న అంశంపై సదస్సులో చర్చించారు.


















