- గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు
- కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి
- కొందరు హింసనే నమ్ముకుంటారు…
- కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది
- ప్రజలకు మంచి చేయడానికే అధికారం
- వైసీపీ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మలేదు
- టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
- టీడీపీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం
అమరావతి(చైతన్యరథం): పంచాయతీ ఎన్నికలల్లోనూ కూట మి బలపరిచిన అభ్యర్థులే గెలవాలని టీడీపీ అధినేత, ముఖ్యమం త్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలతో శనివారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు. పట్టణ, పరిషత్ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక విజయాన్ని ఎన్డీఏకు ఇచ్చారు. 94 మున్సిపాలిటీల్లో, 3235 వార్డుల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. 575 జడ్పీటీసీలు, 7,500 కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో కూటమి నిలబెట్టిన అభ్యర్థులు విజ యం సాధించారు. ఈవీఎం, బ్యాలెట్, పోస్టల్ ఏ విధానమైనా కూటమిదే హవా. మరో 23 పట్టణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించాలి. గ్రామాల్లోనూ కూటమి బలపర్చి న అభ్యర్థులే గెలవాలని స్పష్టం చేశారు. గొడవలకు పోవద్దు.. కొందరు హింసనే నమ్ముకుంటారు.. కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది.
అధికారాన్ని మంచి చేయడానికి, ప్రజలకు దగ్గర కావడానికి ఉపయోగించుకోవాలి. గ్రామస్థాయి ఎన్నికలను నేత లు తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో మంచి నాయకులను తీర్చిదిద్దుకోవడానికి ఈ ఎన్నికలు చక్కటి అవకాశమని తెలిపారు. గ్రామస్థాయి లోనూ కూటమి బలపరిచే అభ్యర్థుల్లో మంచి వారిని ఎంపిక చేయాలని సూచించారు. గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు యాక్టివ్‌గా ఉండి ప్రచారం నిర్వహించాలి. రాబోయే 30 ఏళ్లకు ఉపయోగపడేలా నాయకత్వాన్ని నిర్మించుకుందామని పిలుపు నిచ్చారు. కేంద్రం, రాష్ట్రం, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో ఎన్డీఏనే ఉంది. పంచాయతీల్లో కూడా కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే అన్ని కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయని తెలిపారు. గతం కంటే 25 శాతం ఓటుబ్యాంక్ కూటమికి పెరిగింది. ఉద్యోగులంతా కూట మి ప్రభుత్వం వైపే నిలబడ్డారు. వైసీపీ చేసిన చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మలేదు. సుమారు 7 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశాం. అనకాపల్లి, మార్కాపురం జిల్లాల ప్రజలు 100 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి పోలవరం నీరు, మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలిగొండ ఫేజ్-1 ఫలాలు స్థానిక ఎన్నికల్లో ప్రతిబింబించాయని పేర్కొన్నారు.


















