అమరావతి(చైతన్యరథం): జాతీయ బాలల దినోత్సవం సంద ర్భంగా చిన్నారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి యువత.. దేశానికి భవిత! వారి కల లను సాకారం చేసి ప్రతిభను వెలికి తీసి, వారిలో ఆత్మ విశ్వాసం పెంచేలా తీర్చిదిద్దడం మన బాధ్యత. ఆధునిక సాంకే తికత, విజ్ఞానం, నైపుణ్యాలతో పాటు మన సంస్కృతి, సంప్రదా యాలు, విలువలు నేర్పే విద్యను అందించేందుకు ఎన్డీయే ప్రభు త్వం కట్టుబడి ఉంది. బాలల అభ్యున్నతితోనే రాష్ట్ర ప్రగతి.. దేశ ప్రగతి. వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న లక్ష్యంతో పని చేసామని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
భవిష్యత్‌కు పునాదులు చిన్నారులే: లోకేష్
బాలల దినోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రేపటి గొప్ప భవిష్యత్‌కు పునాదులు మీరే. మీ కళ్లలోని అమాయకత్వం, మీ చిరునవ్వులోని స్వచ్ఛత ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


















