విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన రామో జీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తమ కృషితో సంస్థలుగా, వ్యవస్థలుగా మారిపోతారని.. వారి సేవలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తుల్లో రామోజీ రావు ఒకరని పేర్కొన్నారు.
రామోజీరావును రామ్నాథ్ గోయెంకా వంటి విశిష్ట పాత్రికేయులతోనే పోల్చగలమన్నారు. మారుతున్న కాలానికి, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా రామోజీరావు తన సంస్థలను అభివృద్ధి చేశారని వివరించారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పత్రికను ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిపా రని చెప్పారు. రామోజీతో గతంలో తన అనుబంధాన్ని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాల కారణంగా పలు దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నా భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గత 12 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గతంలో ఏటా వేల సంఖ్యలో నక్సల్ దాడులు జరిగేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపారు.
వచ్చే పదేళ్లలో అగ్రస్థానంలో ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నిరంతరం అభివృద్ధి చెందుతోందని అమిత్ షా ప్రశంసించారు. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందా అని తొలుత భావించానని, అయితే చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ గాడి లో పెట్టారని తెలిపారు. దేశంలోని రాష్ట్రాల అభివృద్ధి గణాంకా లను తాను నిశితంగా పరిశీలిస్తుంటానని, వచ్చే పదేళ్లలో చంద్ర బాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబ డి పెట్టడం రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణమని ప్రశంసించారు.
అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేయనున్న తొలి డేటా సెంటర్ ప్రాజెక్టు దేశ డిజిటల్ రంగానికి కీలకమవు తుందని పేర్కొన్నారు. విశాఖ తీరంలో సముద్రగర్భం నుంచి ఏర్పాటు చేస్తున్న సబ్సీ కేబుల్ కూడా అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టు అని వివరించారు. రాష్ట్రానికి తొలి సెమీకండక్టర్ యూని ట్, స్టీల్ ఫ్యాక్టరీలు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమా నాశ్రయం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని ప్రశంసించా రు. గతంలో కొందరి తప్పులతో నిలిచిపోయిన పోలవరం ప్రాజె క్టును తిరిగి పునరుద్ధరించి రైతులకు, ప్రజలకు నీరందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు.


















