- పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి
- ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి
- ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు
- గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి
- ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
- వ్యక్తిత్వం లేకుండా తల్లి,చెల్లిని కించపరుస్తున్నారు
- అటువంటి వారు రాజకీయాలకు అనర్హులని ధ్వజం
అమరావతి(చైతన్యరథం): త్వరలో జరగనున్న 23 పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబా బు బుధవారం ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయిలో కూటమి పార్టీ లు సమన్వయంతో ఉన్నట్టే… క్షేత్రస్థాయిలోనూ అంతే సమ న్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచి ని చెప్పేలా… గొడ్డలి పార్టీ కుట్రలపై ప్రజలను అప్రమత్తం చేసే లా ప్రణాళికాబద్ధంగా వెళ్లాలని తెలిపారు. గ్రామస్థాయిలో మంచి నాయకత్వం రావాలి… గ్రామస్థాయిలోనే సమస్యలకు పరిష్కారం లభించాలని సూచించారు. అన్ని స్థాయిల్లోనూ మంచి నాయక త్వాన్ని అందించే సత్తా కూటమి పార్టీలకే ఉంది. మంచి చెడులను విశ్లేషించి ప్రజలు ఓట్లేస్తున్నారు. ఇది ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించింది.
కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు వివరించేందుకు పంచాయతీ ఎన్నికలు వేదిక కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గాని కి, ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నాం. సూపర్ సిక్స్ ద్వారా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. పీ4 ద్వారా పేదరికంలో ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాం. కుటుంబానికి ఏం కావాలో… గ్రామానికి చేయాలో ఆలోచించి సమకూరుస్తున్నాం. అర్హుడైన ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూరుస్తున్నాం. మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రతి ప్రాంతాన్ని అభి వృద్ధి చేస్తున్నాం. పెద్దఎత్తున పెట్టుబడుల ద్వారా పారిశ్రామి భివృద్ధి చేస్తున్నాం… ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నాం. రోడ్లు నిర్మిస్తు న్నాం… ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. ప్రతి ఒక్క ఓటూ ముఖ్యం.. ప్రతి ఇంటికి వెళ్లాలి.. ప్రతిఒక్కరినీ ఓటు అడగాలని స్పష్టం చేశారు. ఐక్యతే మన బలం… ఒక కూటమి… మూడు పార్టీలు ఇదే మన విధానం.
2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిఒక్కరూ వ్యవహరించాలి. దానికి అనుగుణంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తల్లి-చెల్లి అని కూడా చూడకుండా వ్యక్తిత్వాలను కించపరిచే వారు రాజకీయా లకు అనర్హులని వ్యాఖ్యానించారు. వ్యక్తిత్వం లేని వారు చెల్లిని అగౌరవపరిచేలా వ్యవహరిస్తూ రాజకీయ ముసుగులో తిరుగుతు న్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించడంతో పాటు…గొడ్డలి పార్టీ కుట్రలనూ చెప్పాలి. హింసే గొడ్డలి పార్టీ విధానం. రాజకీయం కోసం గొడ్డలి పార్టీ ఏమైనా చేస్తుం ది..ఎంతకైనా దిగజారుతుంది…కుట్రలకు పాల్పడతారు. గొడ్డలి పార్టీకి ఓటేయడానికి ప్రజలు ఇష్టపడడం లేదన్నది ఇప్పటికే నిరూపితమైందని తెలిపారు.




















