- మీ స్వార్థం కోసం పావులుగా వాడుకోవద్దు
- ఆర్థిక, విద్యా సంవత్సరానికి కూడా తేడా తెలియదు
- 2024`25 సంబంధించి రూ.3 వేల కోట్లు ఇచ్చాం
- అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడే ఉన్నాం
- ఫీజు బకాయిలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం
- పెండింగ్లో ఉన్న వాటినీ వీలైనంత త్వరగా ఇస్తాం
- జగన్కు మంత్రి నారా లోకేష్ కౌంటర్
అమరావతి(చైతన్యరథం): ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు లపై జగన్రెడ్డి వ్యాఖ్యలకు మరోసారి గణాంకాలు వెల్లడిస్తూ మంత్రి నారా లోకేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ గారూ.. డీఎస్సీకి, ఏపీపీ ఎస్సీకి తేడా తెలియని మీకు ఆర్థిక సంవత్సరా నికి, విద్యా సంవత్సరానికి మధ్య తేడా తెలుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఏ త్రైమాసికంలో విడుదల చేశామన్నది వేరు.. ఆ నిధు లు ఏ విద్యా సంవత్సరపు బకాయిలకు చెల్లించామన్నది వేరు. ఇది కూడా తెలుసుకోలేని జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తు న్నారని మండిపడ్డారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిల కోసం సుమారు రూ.3,000 కోట్లు విడుదల చేశామని అసెంబ్లీలో చెప్పాం.
ఆ మాటకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఏ త్రైమాసికంలో ఎంత మొత్తం విడుదల చేశామో పూర్తి వివరాలను జతచేసిన పట్టికలో స్పష్టంగా చూపించాం. బడ్జెట్ అంచనాలు, సవరించిన కేటాయింపులు, వాస్తవ చెల్లింపుల మధ్య తేడా ఉంటుంది. నిధుల విడుదలకు అనుగుణంగా బడ్జెట్లో సర్దుబాట్లు జరుగుతుంటాయని చెప్పారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు ఈ విషయాలు తెలియకపోవడం, తెలుసు కోకపోవడం విచారకరమన్నారు. మీ హయాంలో ఫీజు రీయింబ ర్స్మెంట్ నిధులు ఎప్పుడూ ఆలస్యంగానే విడుదలయ్యేవి. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేలోపే విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాల్సి వచ్చేది.
మేం ఆ పరిస్థితిని మార్చాం. విద్యా ర్థులపై ఫీజుల భారం పడకుండా నేరుగా కళాశాలలకే నిధులు చెల్లించే విధానాన్ని తీసుకొచ్చాం. ప్రతినెలా రూ.200-300 కోట్ల చొప్పున బకాయిలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. పెండిం గ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ వీలైనంత త్వరగా చెల్లించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపా రు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేjáడం ఇకనైనా ఆపండి… మీ రాజకీయ స్వార్థం కోసం విద్యార్థులను పావులుగా వాడుకోవద్దని హితవుపలికారు.




















