- మొత్తం సీట్లలో 61.34 శాతం ప్రవేశాలు
- ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు అభినందనలు
అమరావతి(చైతన్యరథం): ఏపీలో వైద్య విద్యలో ఆడబిడ్డలు ఎక్కువ సీట్లు దక్కించుకోవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యా రంగంలో ఆడపిల్లలు ముందుండటం గర్వకారణమన్నారు. రాష్ట్ర కోటా కింద కేటాయించిన మొత్తం ఎంబీబీఎస్ సీట్లలో 61.34 శాతం సాధించి, 38.66 శాతం వాటా కలిగిన పురుష విద్యార్థుల ను అధిగమించిన విద్యార్థినులకు అభినందనలు తెలిపారు. ఇది వారి ప్రతిభ, పట్టుదల, పెరుగుతున్న ఆకాంక్షలకు నిదర్శనమ న్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ కలలు కనడానికి… సాధించ డానికి, నాయకత్వం వహించేందుకు సమాన అవకాశాలు కల్పిం చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాల వివరాలు
2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలో రాష్ట్ర కోటా ఎంబీబీఎస్ సీట్లలో 61.34 శాతం సీట్లను విద్యార్థినులు కైవసం చేసుకున్నారు. రాష్ట్ర కోటా కింద ఉన్న మొత్తం 6,937 ఎంబీబీఎస్ సీట్లలో 6,929 సీట్లు భర్తీ కావడంతో 99.88 శాతం అడ్మిషన్లతో ప్రవేశాల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. మొత్తం రాష్ట్ర కోటా సీట్లలో అమ్మాయిలు 4,250 సీట్లు (61.34%) సాధించగా, అబ్బాయిలు 2,679 సీట్లు (38.66%) పొందారు. కన్వీనర్ కోటాలోని మొత్తం 4,581 సీట్లు (ప్రభుత్వ కళాశాలల్లో 2,631, ప్రైవేట్ కళాశాలల్లో 1,950) పూర్తిగా భర్తీ అవగా.. ఇందులో 62.39 శాతం సీట్లను విద్యార్థినులే దక్కించుకున్నారు. మేనేజ్మెంట్ కోటాలో 2,356 సీట్లకు గానూ 2,348 సీట్లు భర్తీ కాగా, ఇందులోనూ 59.28 శాతంతో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. ఏపీలోని మొత్తం 7,465 ఎంబీబీఎస్ సీట్లలో 528 సీట్లను ఆల్ ఇండియా కోటాకు కేటాయించారు. ఎనఎంసీ అనుమతితో నిర్వహించిన స్పెషల్ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్లో మిగిలిన 69 ఎనఆరఐ కేటగిరీ సీట్లలో 61 భర్తీ కాగా, కేవలం 8 సీట్లు మాత్రమే ఖాళీగా మిగిలాయి. పాడేరు, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మిగిలిన సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లుగా మార్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కొత్తగా ఏర్పాటైన పిడుగురాళ్ల వైద్య కళాశాలలోని 22 కన్వీనర్ కోటా సీట్లు మూడో విడత కౌన్సెలింగ్ నాటికే పూర్తిగా నిండిపోయాయి. తుది అడ్మిషన్ల నివేదికను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సమర్పించింది.



















