- 44 ఘటనలపై కేసులు నమోదు
- డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడి
అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 26 జిల్లాల్లోని 201 మండలాల్లో, 3,191 గ్రామ పంచా యతీ సర్పంచ్ స్థానాలకు, 25,061 వార్డు స్థానాలకు పోలింగ్ తదనంతర లెక్కింపు ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రం లోని 21 జిల్లాల్లోని 4 మున్సిపల్ కార్పొరేషన్లలోని 258 వార్డుల కు, 19 పట్టణ స్థానిక సంస్థల్లో 711 వార్డులకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. గురువారం అమరావతి వేదికగా డీజీపీ మీడియాతో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ కోసం 46,380 మంది పోలీస్ సిబ్బందితో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతా ల్లో ప్రత్యేక నిఘా, సాంకేతిక పరిజ్ఞానం, అదనపు బలగాల మోహరింపుతో ఎన్నికల భద్రతను పటిష్ఠంగా పర్యవేక్షించామని వెల్లడించారు.
ఎన్నికలకు సంబంధించి పల్నాడు, సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి తదితర జిల్లాల్లో మొత్తంగా 44 ఘటనలు చోటుచేసుకున్నాయని ప్రస్తా వించారు. వీటికి సంబంధించి చట్టపరంగా కేసులు నమోదు చేశామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అనం తరం బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్‌లకు పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య సురక్షితంగా తర లించామని చెప్పారు. ఎన్నికల అనంతరం ఎలాంటి అవాంఛనీ య సంఘటనలకు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ అప్రమ త్తంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.



















