చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలక

కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి ఢిల్లీలో మీడియా సమావేశం

by చైతన్యరధం
November 28, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలక
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదు
  • రెండు బిల్లులకూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలి
  • బిల్లులను వ్యతిరేకించిన వారిని మహిళలు తిరస్కరిస్తారు
  • మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు సీఎం చంద్రబాబు మద్దతు
  • కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి ఢిల్లీలో మీడియా సమావేశం

“మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, జనాభాకు అనుగుణంగా పార్లమెంటు స్థానాలను పెంచాల్సిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనలోనూ అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలి. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుత స్థానాలపై 50 శాతం సీట్లు పెంచాలి. 2029 ఎన్నికల నాటికి డీలిమిటేషన్ పూర్తి చేసి, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు తిరస్కరిస్తారు. దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య విస్తరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలి”

ఢిల్లీ (చైతన్య రథం): మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంటు స్థానాలను పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తందని పేర్కొన్నారు. ఈ కీలక నిర్ణయాలకు మద్దతు తెలిపేందుకే ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి హెచ్ఎ కుమారస్వామి, ఇతర కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నారని, విద్య,
ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు రాజకీయ రంగంలోనూ వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. మహిళా సాధికారతకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యం ఎంతో కీలకమని ముఖ్యమంత్రి వివరించారు.

జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం పెరగాలి
1971 జనాభా లెక్కల ఆధారంగా 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని, తర్వాత కూడా పాత జనాభా ప్రాతిపదికనే లోక్సభ స్థానాల సంఖ్య కొనసాగుతోందని చంద్రబాబు వివరించారు. అప్పట్లో దేశ జనాభా 58.8 కోట్లుగా ఉండగా, లోక్సభలో 543 స్థానాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశ జనాభా సుమారు 147 కోట్లకు చేరుతున్న నేపథ్యంలో అదే 543 స్థానాలతో కొనసాగడం సమంజసం కాదన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరగాలని అభిప్రాయపడ్డారు. 1971లో ప్రతి పది లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సుమారు 27 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచితే ప్రతి 18 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను పార్లమెంటులో సమర్థంగా ప్రస్తావించేందుకు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని విస్తరించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.

దక్షిణాది ప్రయోజనాలకు భంగం వాటిల్లదు..
జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు గతంలో దేశానికి ఆదర్శంగా నిలిచాయని సీఎం గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ప్రచార కార్యక్రమాల ద్వారా సంతానోత్పత్తి రేటును తగ్గించగలిగామని వివరించారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, జనాభా నియంత్రణతో పాటు జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ రేటు తక్కువగా ఉన్న నేపథ్యంలో 2026 జనాభా లెక్కలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఈ రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో నష్టపోకూడదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఉన్న స్థానాలపై 50 శాతం అదనపు సీట్లు పెంచే విధానం తీసుకురావడం సముచితమన్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు కూడా పూర్తి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రజల్లో అనవసరమైన అసంతృప్తి, ఆందోళనలు తలెత్తకుండా, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఏపీకి 25 నుంచి 38 స్థానాలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయని, 50 శాతం సీట్ల పెంపు జరిగితే ఆ సంఖ్య 38కి చేరుతుందని చంద్రబాబు వివరించారు. తమిళనాడులో 59, కర్ణాటకలో 42, తెలంగాణలో 26, కేరళలో 30కి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల సంఖ్య 195కు చేరుతుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజాప్రాతినిధ్యం విస్తరిస్తుందని చెప్పారు. 2001 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కూడా జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రాతినిధ్యం పెరగలేదని, ప్రస్తుతం ప్రతి ఎంపీపై అధిక జనాభా భారం ఉందని వివరించారు. కొత్త డీలిమిటేషన్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉందని, మహిళా రిజర్వేషన్ల అమలుకు కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు ఎన్టీఆర్ పునాది
మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని చంద్రబాబు గుర్తుచేశారు. 1986లోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో వారి భాగస్వామ్యానికి పునాది వేశారని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు కృషి చేశానన్నారు. నేడు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ‘స్వయం’ బ్రాండ్ను తీసుకొచ్చామని, వాటిని అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

విద్య, ఉద్యోగాల్లో మహిళలకు అవకాశాలు పెంచడంతో పాటు ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకాల్లోనూ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఏపీలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పటి నుంచి వారి రాజకీయ భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పది మేయర్ స్థానాల్లో ఎనిమిది స్థానాలను మహిళలు గెలుచుకున్నారని చెప్పారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన మహిళలు నగరాల ప్రథమ పౌరులుగా బాధ్యతలు చేపట్టడం సంతోషకరమన్నారు.

దేశ భవిష్యత్తుకు మహిళల భాగస్వామ్యం కీలకం
మహిళా రిజర్వేషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని చంద్రబాబు తెలిపారు. ఈ అంశంపై తమ ప్రభుత్వం నిరంతరం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తోందన్నారు. ప్రధాని మోదీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందు కు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని, ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశ మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. గతంలో మాజీ ప్రధాని దేవెగౌడ హయాంలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినా వివిధ కారణాలతో ఆమోదం పొందలేకపోయిందని గుర్తుచేశారు. గత సమావేశాల్లో కొన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయని, అలాంటి తప్పిదాలు మరోసారి జరగకూడదని విజ్ఞప్తి చేశారు. మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు దానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు.

మహిళా రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంటు సమావేశాల్లో సభ్యులంతా బిల్లుకు
అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చారిత్రక తప్పిదానికి పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. భారతీయులు సాంకేతికత, నాయకత్వ రంగాల్లో
ఇప్పటికే ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారని, దేశం మరింత ముందుకు వెళ్లాలంటే సమర్థవంతమైన మహిళా నాయకత్వం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత సాధించినప్పుడే మహిళలు దేశ అభివృద్ధిలో మరింత క్రియాశీలక పాత్ర
పోషించగలరన్నారు. మహిళల భాగస్వామ్యంతోనే భారత్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకోవాలన్న ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పారు.  మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు తిరస్కరిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. దేశ ప్రయోజనాలు, మహిళల భవిష్యత్తు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య విస్తరణను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026

November 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

November 27, 2026
రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్ రాజకీయ డ్రామా
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్ రాజకీయ డ్రామా

November 27, 2026
రాజ్యాంగ స్ఫూర్తికి పెద్దపీట వేస్తూ.. సుపరిపాలనకు చిరునామాగా కూటమి పాలన
ఆంధ్రప్రదేశ్

రాజ్యాంగ స్ఫూర్తికి పెద్దపీట వేస్తూ.. సుపరిపాలనకు చిరునామాగా కూటమి పాలన

November 27, 2026
ప్రజా బలం తగ్గడంతో వైసీపీ మూకల దాడులు
ఆంధ్రప్రదేశ్

ప్రజా బలం తగ్గడంతో వైసీపీ మూకల దాడులు

November 27, 2026
విజ్ఞాన విప్లవానికి ఏడాది… యువత విజయానికి వేదిక
ఆంధ్రప్రదేశ్

విజ్ఞాన విప్లవానికి ఏడాది… యువత విజయానికి వేదిక

November 27, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026

ముఖ్య వార్తలు

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలక

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలక

by చైతన్యరధం
November 28, 2026

డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదు రెండు బిల్లులకూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలి బిల్లులను వ్యతిరేకించిన వారిని మహిళలు తిరస్కరిస్తారు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు సీఎం...

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

by చైతన్యరధం
November 26, 2026

గాడిలో పడుతున్న వ్యవస్థలు... 2027 మార్చి నాటికి 100శాతం ఫలితాలు సాధించేలా కృషి సావరిన్ ఏఐ స్టాక్ ద్వారా రెవెన్యూ రియలైజేషన్ ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

by చైతన్యరధం
November 6, 2026

1.43 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట పొలాలు రాష్ట్రంలో తుఫాను నష్టంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించాలని ఆదేశం నేడు ముంపు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026

by కార్యకర్త
November 28, 2026

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలక

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలక

by చైతన్యరధం
November 28, 2026

డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదు రెండు బిల్లులకూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలి బిల్లులను వ్యతిరేకించిన వారిని మహిళలు తిరస్కరిస్తారు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు సీఎం...

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

by కార్యకర్త
November 27, 2026

రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్ రాజకీయ డ్రామా

రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్ రాజకీయ డ్రామా

by చైతన్యరధం
November 27, 2026

బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి ఐదేళ్ల పాలనలో సీమకు తీరని ద్రోహం చివరి భూముల వరకు కృష్ణా జలాలు పారిస్తున్న సీఎం చంద్రబాబు...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.