- టీఎస్‌లో ఏపీ పురావస్తు సంపద తెచ్చేందుకు చర్యలు
- అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కందుల దుర్గేష్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు, పురావస్తు తవ్వకాలను ముమ్మరం చేయడంతో పాటు బౌద్ధ సర్క్యూట్‌లను అభివృద్ధి చేస్తామని పర్యాటక, సాంస్కృ తిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండ లి బుద్ధప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కందుల దుర్గేష్ క్లుప్తంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్ర దేశ్‌లో 65 ప్రాంతాల్లో, విభజన తర్వాత పురావస్తు శాఖ 3 ప్రధా న ప్రాంతాల్లో ఫీల్డ్ సీజన్‌లో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపిందని తెలిపారు. 2014-15, 2015-16లో జరిపిన తవ్వకాల్లో కాకినా డ జిల్లా ఎ.కొత్తపల్లి (పెద్దమెట్ట) బౌద్ధ క్షేత్రంలో మహాస్థూపాలు, 8 ఓటివ్ స్థూపాలు (చిన్న స్థూపాలు), విహారాలు(నివాస ప్రాంతాలు), ఎర్రమట్టి పాత్రలు బయటపడ్డాయని.. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తవ్వకాలు జరపడం కష్టమని భావించి పోలవరం ముంపు ప్రాంతాలైన రుద్రమకోట, రాయనపేటలలో 2017-18 లో తవ్వకాలు జరపగా క్రీ.పూ.1000-300 నాటి ప్రాచీన మాన వుడి సమాధులు (మెగా లిథిక్స్), ఇనుప వస్తువులు, మట్టి పాత్రలు లభ్యమయ్యాయని వివరించారు.
ఈ తవ్వకాలకు ప్రత్యేక బడ్జెట్ అంటూ ఏమీ లేదని పోలవరం ప్రాజెక్టులో భాగంగా పురా వస్తు శాఖ ఎక్స్‌కవేషన్ బడ్జెట్‌లో నుంచి వినియోగించి తవ్వకాలు జరిపామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉండిపోయిన ఏపీ పురావస్తు సంపదను తిరిగి రప్పించే విషయమై త్వరలోనే ఇరు రాష్ట్రాల అధికారుల సమన్వయంతో దీనిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పురావస్తు శాఖ ద్వారా మరిన్ని తవ్వకాలు చేపట్టం, దొరికిన అవశేషాలను నిక్షిప్తం చేయడం, సంబంధిత అంశాలను గ్రంథస్తం చేయడం వాటిని ప్రజల సందర్శనార్థం మ్యూజియంలో పెట్టడం ఆవశ్యకమని భావిస్తున్నామని తెలిపారు. 154 పోస్టులకు గాను 54 మంది సిబ్బంది ఉన్నారని సిబ్బంది కొరతను తీర్చాలని కోరారు. కళింగుల రాజధానిగా కీర్తిపొందిన శ్రీకాకుళం జిల్లా దంతపురం, విజయనగరం జిల్లా గుడివాడకొండలలో రాబోయే రోజుల్లో తవ్వకాలు చేపడతామని ప్రకటించారు. పురావస్తు శాఖ లో సిబ్బంది కొరతను తీర్చడం, తవ్వకాల్లో దొరికిన అవశేషాలను భద్రపరిచి మ్యూజియాల్లో ప్రదర్శనకు ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. హైదరాబాద్‌లోని మ్యూజియం మాత్రమే కాక ఏలూరులోని మ్యూజియం, రాజమహేంద్రవరంలోని రాళ్ల బండి సుబ్బరావు మ్యూజియంలకు ప్రత్యేక చరిత్ర ఉందని ఆయా మ్యూజియాల్లో సంబంధిత నివేదికలు పొందుపరిచేందుకు అవకాశం ఉందన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కే.కే. రంగారావు(బేబీ నాయన) అడిగినట్లుగా చిత్రకోట బౌద్ధక్షేత్రం అంశం తమ పరిగణలో ఉందన్నారు.
‘బౌద్ధ సర్క్యూట’గా అభివృద్ధి చేస్తాం
ఏపీలో బౌద్ధమత వ్యాప్తికి నిలయాలైన అమరావతి, నాగార్జు నకొండ, ఘంటసాల, ఆదుర్రు, తొట్లకొండ, బావికొండ, చిత్రకోట వంటి ప్రాంతాలను కలిపి ‘బౌద్ధ సర్క్యూట’గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావ త్ సహకారంతో, కేంద్ర బడ్జెట్ కేటాయింపులను ఉపయోగిం చుకుని అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో బౌద్ధమత వ్యాప్తి జరిగిన బౌద్ధ క్షేత్రాలను సర్క్యూట్‌గా చేయాలని ఇప్పటికే టూరిజం శాఖ, పురావస్తు శాఖ సంయుక్తంగా కేంద్రాన్ని కోరిందని, తాము కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిన వెంటనే బుద్ధిస్ట్ సర్క్యూట్‌లకు సంబంధించిన అభివృద్ధి చేయను న్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదా యాలు, చారిత్రక అంశాలపై మండలి బుద్ధ ప్రసాద్‌కు ఉన్న శ్రద్ధను, మంత్రి కందుల దుర్గేష్ ఆసక్తిని అభినందించారు. కేంద్రం నుంచి నిధుల సాధన కోసం తామంతా కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు.















