అమరావతి(చైతన్యరథం): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిని కాపాడటానికి, చెడును అంతమొందించటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించారన్నారు. చిన్ని కృష్ణుని జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దైవమై రక్షిస్తూ, గురువులా నేర్పిస్తూ, స్నేహితుడై వెన్నంటి నిలుస్తున్న నందగోపాలుని ఆశీస్సులతో ప్రజలంతా ఆనందమయ జీవితం గడపాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.