- నోట్ల కట్టలు నింపుకుని ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి
- ఆర్టీసీ ద్వారా రాష్ట్రం మొత్తం పంపించేందుకు పథకం
- ఎన్టీఆర్ బస్టాండ్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సీసీ టీవీ ఫుటేజీలు బయటపెట్టాలి
- ఈసీ విచారణ జరపాలి
- టీడీపీ నేత పట్టాభి ఆరోపణ
అమరావతి (చైతన్యరథం): జగన్‌రెడ్డి ఐదేళ్ల పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్ర చందనంలో బొక్కిన వేలకోట్ల సొమ్మంతా నేడు బయట పడుతోందని, ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కి చేర్చి అక్కడ నుంచి కంటెయినర్లలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీసీ అభ్యర్దులకు చేరవేస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. బుధ వారం మంగళగిరిలోని టీడీపీ జాతీయకార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ…. విశాఖ డ్రగ్ కంటెయినర్ అంశం మరువక ముందే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయల్దేరిన కరెన్సీ కంటెయినర్ అంశం వెలుగులోకి వచ్చిందన్నారు. రేణి గుంటలో కుక్కర్లు, మిక్సీలు, వాచీలు వంటి తాయిలాల తో ఉన్న వైసీపీ డంప్ బయటపడిన 24 గంటల్లోనే తాడేపల్లి ప్యాలెస్‌లో కరెన్సీ కంటెయినర్ వ్యవహారం బట్టబయలైంది. గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నపుడు ఎప్పుడైనా చంద్రబాబు ఇంటికి గానీ, మరే ఏ ముఖ్యమంత్రి ఇంటికి గానీ, దేశంలో ఏ ముఖ్య మంత్రి ఇంటిలోకైనా కంటెయినర్ వెళ్లినా దాఖలాలు న్నాయా? ఈ కంటెయినర్ జగన్ సిద్ధం యాత్రకు వంట పాత్రలు తరలించడానికి అని, కిచెన్ తో కూడిన పాంట్రీ అని వైసీపీ నాయకులు, బులుగు మీడియా తప్పుదారి పట్టిస్తోంది.
జగన్‌రెడ్డి ఐదేళ్ల పాటు దోచిన వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లలో రాష్ట్ర వ్యాప్తం గా వైసీసీ అభ్యర్దులకు చేరవేస్తున్నారు. మంగళవారం ఏపీ16 0363 నెంబర్ వాహనంతో ఉన్న కంటెయినర్ తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసు నుంచి కరెన్సీ కట్టలతో బయటకి వెళ్లింది. ఈ కంటెయినర్ బుధవారం మధ్యా హ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో విజయవాడ బస్టాండ్‌లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ఆగింది. దానిలో నుంచి కరెన్సీ కట్టలతో నిండిన అట్ట పెట్టెలను దింపి డిపో క్లర్క్ ఎర్నింగ్ అనే అధికారి చాం బర్‌లోకి తీసుకెళ్లారు. ఈ నగదను కౌంటింగ్ మిషన్లు పెట్టి మరీ లెక్కించారు. అక్కడ నుంచి ఆర్టీసీ వ్యవస్ధను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు రాష్ట్రం మొత్తం తరలించేందుకు ప్రణాళిక సిద్దంచేశారు.
ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి వంటి వ్యక్తులకు ఆర్టీసీ ఉన్నత పదవులు కట్టబెట్టి ఆ సంస్ధ ప్రతిష్ట దిగజార్చారు. అలాంటి స్మగ్లర్ల సలహాతోనే ఆర్టీసీని నగదు స్మగ్లింగ్ కి జగన్ రెడ్డి వాడుకుంటున్నారు. ఈ వాహనం నుంచి కరెన్సీ కట్టలు వచ్చాయోలేదో ఆర్టీసీ అధికారులు సమా ధానం చెప్పాలి. ఎన్టీఆర్ బస్టాండ్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సీసీ ఫుటేజీలు బయటపెట్టాలి. తక్షణమే ఈసీ అధికారు లు ఆ సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలి. బరితెగించి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కంటెయినర్లలో నోట్ల కట్ట లు పంపిస్తున్నారు. డీజీపీకి ఏమాత్రం నిజాయితీ ఉన్నా పోలీసులను ఎన్టీఆర్ బస్టాండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కి పంపి అక్కడ సీసీ పుటేజీలు బయటపెట్టాలి. వైసీపీ వాళ్లేమో ఈ కంటెయినర్ కిచెన్ పాంట్రీ అంటున్నారు, కానీ అందులో కట్టలు కట్టలు కరెన్సీ తీసుకెళ్తున్నారు. దేశం అంతా డిజిటల్ పేమెంట్స్‌ని వాడుతుంటే ఇంత పెద్ద ఎత్తున కరెన్సీ కట్టలు వారి వద్దకు ఎలా చేరాయో దీనిపై ఏపీఎస్‌ఆర్టీసీ వివరణ ఇవ్వాలి.
చంద్రబాబు పాలనలో ఏపీఎస్ ఆర్టీసీ అంటే ఒక బ్రాండ్,ఇప్పుడు జగన్‌రెడ్డి పాలనలో భ్రష్టు పట్టిపోయిం ది.దొంగల్ని మించిన గజదొంగ 420జగన్‌రెడ్డి. మేము సిద్దం అంటూ ప్రచార సభలు నిర్వహిస్తున్న జగన్‌రెడ్డి వేటికి సిద్దం? మత్తు పదార్థాల కంటెయినర్లతోనా? డ్రగ్ కంటెయినర్లతోనా? ఆయన దేనికి సిద్ధం.. సిద్ధం సభల్లో ప్రజలకు జగన్ ఏం చెబుతారు? కంటెయినర్ల లో డబ్బులు పంపిస్తున్నాం.. మా వాళ్లు వచ్చి మీకు పంచుతారు అని చెబుతారా? కరెన్సీతో పాటు కుక్కర్లు, మిక్సీలు ఇస్తారని చెబుతారా? అంతకు మించి జగన్ రెడ్డి ఏం చేశారని చెబుతారు? ఇలాంటి కంటెయినర్లు ఎన్ని పంపినా ప్రజలు జగన్‌కి బుద్ది చెప్పేందుకు సిద్దం గా ఉన్నారు. ఈ కంటెయినర్ వ్యవహారంపై ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరపాలని, ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.