- అడుగడుగునా హారతులతో నీరాజనాలు పట్టిన మహిళలు
- నేడు ముమ్ముడివరం బహిరంగసభలో ప్రసంగించనున్న లోకేష్
అమలాపురం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అమలాపురం ప్రజలు బ్రహ్మరథంపట్టారు.యువగళం పాదయాత్ర 211వ రోజు మంగళవారం అమలాపురం, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగించారు. పాదయాత్ర అమలాపురం పట్టణానికి చేరుకోగానే మహిళలు హారతులు పడుతూ యువనేతకు నీరాజనాలు పలికారు. అమలాపురం టౌన్‌లో యువనేతను చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. రోడ్డుకి ఇరువైపు లా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేశారు. తమకు సంఫీుభావం తెలిపిన మహిళలు, యువత, వృద్ధులను కలుస్తూవారి సమస్యలను తెలుసు కున్నారు. విద్యుత్ ఛార్జీల బాదుడు తట్టుకోలేకపోతు న్నాం అంటూ లోకేష్ వద్ద మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రభుత్వం సామాన్యుడిపై పెను భారం మోపుతోం దని మండిపడ్డారు. పెరిగిన ఖర్చులతో బతకడం కష్టంగా మారింది. మీ ప్రభు త్వం వచ్చిన తరువాత మాపై భారం తగ్గించాలి అని మహిళలు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. జగన్ 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచే శాడు. బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తాం అని హామీ ఇచ్చిన లోకేష్. అనాతవరం వద్ద యువగళం పాదయాత్ర ముమ్మడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించించింది. ముమ్మడివరం ఇన్‌ఛార్జి దాట్ల సుబ్బరాజు నేతృత్వంలో యువనేతకు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలు, బాణాసంచాతో యువనేతను కార్యకర్తలు స్వాగతించారు. యువనేతను కలిసి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. యువనేతతో ఫోటోలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు. లోకేష్ ను వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు. మరో 3నెలల్లో జగన్ అరాచక పాలన అంతమవుతుంది, టీడీపీ-జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. 211వరోజు యువనేత లోకేష్ 18.5 కి.మీ.ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2886.3 కి.మీ.ల మేర పూర్తయింది. బుధవారం ముమ్మడివరం సెంటర్ లో నిర్వహించే బహిరంగసభలో లోకేష్ ప్రసంగించనున్నారు.