- 10 వేల ఎకరాలు మింగిన కేసీఆర్
- బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు
సిద్దిపేట:కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అయితే.. ప్రజలకు బొందల తెలంగాణగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధి పేట జిల్లా దుబ్బాకలో గురువారం దుబ్బాక నియోజక వర్గ కేంద్రంలో కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ మాట్లాడుతూ దుబ్బాకకు రావలసిన నిధులు మామ అల్లుళ్ళు సిద్దిపేటకు తరలించుకు పోయారని విమర్శిం చారు. మూడేండ్లలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పిన బీజేపీ ఎమ్మెల్యేకు ఓటు అడిగే హక్కు లేదన్నా రు. బీజేపీ రాజకీయ కుమ్ములాటల్లో రఘునందన్ మునిగిపోయారని విమర్శించారు. నేను బక్కోన్ని అని అంటున్నాడు కేసీఆర్.. బక్కోనికి బుక్కెడు బువ్వ, రెండు పెగ్గుల మందు కావాలి. కానీ 10వేల ఎకరాలు మింగి నవ్ అని దుయ్యబట్టారు. ఆ పక్క హరీశ్‌రావు, మరో పక్క కేటీఆర్ ఉండి దుబ్బాకను ఎందుకు బంగారు తునుక చేయలేదని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500 లేకే గ్యాస్ సిలిండర్, ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు,తులం బంగారం, వ్యవసాయా నికే కాదు గృహావసరాలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా అందజేస్తామన్నారు. కాంగ్రెస్‌వస్తే రైతుబం ధు రాదని కేసీఆర్ చెబుతున్నారని… కేసీఆర్ మతి పోయి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుందో తెలియడం లేదని విరుచుకుపడ్డారు. రైతుకే కాదు.. భూమి లేని పేదలకు కూడా రూ.12000 రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల విద్యకు రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. పింఛన్ ఈ నెల కేసీఆర్ ఉంటే 2వేలే అని.. వచ్చేనెల కేసీఆర్ సర్కారును బొంద పెడితే రూ.4 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు కూడా చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తా నని సెటైర్ విసిరారు.కేసీఆర్‌తో పాటుఆయన కొడుకు, బిడ్డ ఉండడానికి ఖచ్చితంగా ఇలు కట్టిస్తానన్నారు. కేసీ ఆర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తానని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.