అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో టీచర్లను పోలింగ్ విధులకు దూరంగా ఉంచేందుకు జగన్ రెడ్డి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలకు గండిపడిరది. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్రంలో అధికార వైసీపీ కి కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. దీంతో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) ప్రారంభించారు.
టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ఏపీ ప్రభుత్వం భావించింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. టీచర్లకు బోధనేతర పనులను అప్పగించకూడదని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులను సైతం సచివాలయ సిబ్బందితోనే చేయించింది. ఈ విషయంపై తెలుగుదేశం, జనసేన అధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను(సీఈసీ) కలిసి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను టీచర్లకు అప్పగించాలని కోరారు. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని బుధవారం విజయవాడలో నిర్వహించిన సీఈసీ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో అసలు సిబ్బంది ఎంతమంది ఉన్నారనే అంశంపైనా చర్చ జరిగింది. సచివాలయ ఉద్యోగుల్ని తీసుకోవద్దని విపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశంపైనా చర్చించారు. వారిని తీసుకున్నా సిబ్బంది సరిపోరని తేలడంతో టీచర్లను నియమించాలని నిర్ణయించారు.
ఈసీ కీలక ఆదేశాలు..
కాగా..ఏపీలో రెండు రోజుల పర్యటన ముగించుకుని బుధవారం తిరిగి వెళ్లిన కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని సీఈసీ ఆదేశించారు. విద్యాశాఖ పరిధిలోని టీచర్లు, బోధనేతర సిబ్బంది వివరాలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడిరగ్, అసిస్టెంట్ ప్రిసైడిరగ్ ఆఫీసర్లుగా వారిని నియమించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను డీఈవోలు సేకరిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఈనెల 12వ తేదీ లోపు వివరాలను డీఈఓ కార్యాలయాలకు అందజేయాలని సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అడ్డుకునేందుకు ఢల్లీి స్థాయిలో వైసీపీ అగ్ర నేతలు ప్రయత్నించినా కేంద్ర ఎన్నికల కమిషన్ ససేమిరా అన్నట్లుగా తెలిసింది.
ప్రిసైడిరగ్, అసిస్టెంట్ ప్రిసైడిరగ్ ఆఫీసర్లుగా టీచర్లను నియమించనున్నారు. పోలింగ్ బూత్ ఇంచార్జిగా ప్రిసైడిరగ్ ఆఫీసరే ఉంటారు. అంటే.. టీచర్లే ఇంచార్జులుగా ఉంటారు కాబట్టి జగన్ రెడ్డి ప్లాన్ పూర్తి రివర్స్ అయినట్లవుతుంది.
ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు ఏపీ ఉచిత, నిర్బంధ విద్య (విద్యా హక్కు చట్టం) నియమాలు-2010కి సవరణ చేసింది. వారికి బోధనేతర పనులను అప్పగించవద్దని, విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేయాలని పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం-2009లోని సెక్షన్ 27 ప్రకారం జనాభా గణన, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన విధులు మినహా విద్యేతర పనులకు వారిని వినియోగించకూడదు. అయితే సెక్షన్-27లోని నిబంధనలకు అనుగుణంగా బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకు చట్టంలో సవరణలు తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టి.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించేందుకు ఈ సవరణ తీసుకొచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్క టీచర్లు కాదు ఏపీలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఏ ఒక్క ఉద్యోగి సంతృప్తికరంగా లేరు. అయినా టీచర్లు ఇంకా ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వారిని పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని.. చట్టం కూడా తీసుకు వచ్చారు. ఆ చట్టం ఎన్నికల సంఘానికి వర్తించదు. ఇది తెలిసి కూడా చేశారు. చివరికి టీచర్ల చేతుల్లోకే ఎన్నికల విధులు వెళ్తున్నాయి.