- 57 మంది జగన్ భక్త డీఎస్పీలకు నో పోస్టింగ్
- రాష్ట్రవ్యాప్తంగా 96 మంది బదిలీ
అమరావతి(చైతన్యరథం): పోలీస్ వ్యవస్థలో మహా ప్రక్షాళన దిశగా భారీగా డీఎస్పీలను బదిలీ చేశారు. జగన్‌పై భక్తితో వైసీపీతో అంటకాగిన 57 మంది డీఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం బదిలీ చేసింది. బుధవారం భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా 96మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 57మంది డీఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వకుండా హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీతో అంటకాగి.. ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేసిన వారి జాబితాను ఇందులో పొందుపరిచినట్లు సమాచారం.
మొత్తంగా 96మందిని స్థానచలనం చేయగా.. వీరిలో కొందరు వివాద రహితమైన వారిని డీఎస్పీలు, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. మిగతా 57మందికి మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. బదిలీ అయినవారిలో సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు, ఇతర విభాగాల అధికారులు ఉన్నారు. వైసీపీ హయాంలో ప్రజా ప్రతినిధులకు ఊడిగం చేస్తూ వారి భజనలో మునిగి, బాధితుల మీదే కేసులు పెట్టి భయపెట్టిన వారికి పోస్టింగ్‌లు లభించలేదు. ఇది పోలీస్ వ్యవస్థ లోనే మహా ప్రక్షాళనగా కనిపిస్తోంది. ఒక రాజకీయ క్రిమినల్‌కు ఒక్క అవకాశం ఇస్తే.. వ్యవస్థనే ఎలా నాశనం చేశాడో ఈ బదిలీలు చూస్తే అర్ధం అవుతుంది.