అమరావతి : జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేసాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాడు. ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా, ఉన్న వాటి నిర్వహణనీ పట్టించుకోలేదు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయింది. గతేడాది గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్‌లో నీరంతా వృథాగా పోతోందని లోకేష్ అన్నారు.
తుఫాన్ ప్రాంతాల పర్యటనకు వెళ్లిన జగన్‌రెడ్డి చేలల్లోకి దిగకుండా రోడ్డుపైనే వేదిక ఏర్పాటుచేసుకుని దానిపైనుండే పంటనష్టాన్ని పరిశీలించటంపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.తుఫాన్ నష్టాలు పరిశీలనకు వెళ్లిన నీకు రెడ్‌కార్పెట్ స్వాగతాలా? కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా ఇవ్వడానికి నీకు డయా స్ కావాలా? పంటలు పోయి కన్నీళ్ళతో ఉన్న రైతులను నువ్వు పరామర్శించాలంటే బారికేడ్ల అడ్డుగోడలా? దీనినే పిచ్చి అంటారు జగన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు.