చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ 2.0తో అభివృద్ధిలో కొత్త శకం

శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

by చైతన్యరధం
Sep 19, 2025 at 6:08am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, తెలంగాణ
జీఎస్టీ 2.0తో అభివృద్ధిలో కొత్త శకం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు
  • ఈ లబ్ధి గ్రామస్థాయి వరకు ప్రతి కుటుంబానికీ చేరాలి
  • జీఎస్టీ సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలిరాష్ట్రం ఏపీ
  • రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నా.. ప్రజా ప్రయోజనాల కోసం నిలబడిన సీఎం చంద్రబాబు
  • శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

అమరావతి (చైతన్యరథం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా భారత దేశం మరో గొప్ప దశలోకి ప్రవేశించనుంది.. జీఎస్టీ సంస్కరణల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుంది.. దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది.. తద్వారా మార్కెట్లో డిమాండ్‌ పెరిగి కొత్త పరిశ్రమల రాకకు, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి దోహదం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఈ సమష్టి నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి అమలు చేయబోతున్న జీఎస్టీ 2.0 సంస్కరణలపై శాసన సభలో గురువారం జరిగిన చర్చలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఇది దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లబ్ధి చేకూర్చే నిర్ణయం అన్నారు. జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతి పెద్ద సంస్కరణలో రాష్ట్ర ప్రతినిధిగా భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న ఎర్రకోట నుంచి ఈ విషయంలో చేసిన చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తుంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కృషి అభినందనీయం. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో ఈ సంస్కరణలను ఆమోదించింది. రాష్ట్ర ఆదాయాలకు నష్టం కలుగుతున్నా.. సామాన్యుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధానాలను బలంగా సమర్థించారు. ఆర్థిక ఆటుపోట్లను భరిస్తూ కూడా సంస్కరణల వల్ల ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉన్నా.. జీఎస్టీ సంస్కరణలకు ముందుండి మద్దతు తెలిపినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఈ చారిత్రక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌ కావడం గమనార్హం. జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం… సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని పెంచి, వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి, పన్నుల విధానంలో పారదర్శకత తీసుకురానుంది. ఈ చారిత్రాత్మక సంస్కరణ పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార, పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది.
పజలకు, ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైన సంస్కరణ
ప్రజల పొదుపుని పెంచడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచేందుకు, కొత్త పెట్టుబడులు ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి ఇది దోహదపడుతుంది. జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అత్యధికంగా ఉపయోగించే వస్తువుల సేవలకు డిమాండ్‌ పెంచి, ఉత్పత్తులను విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది. ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు చాలా లాభదాయకమైన సంస్కరణగా పవన్‌ పేర్కొన్నారు.
పెరగనున్న గ్రామీణ ప్రజల ఆదాయం
రైతుల కోసం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు పరికరాలు, ఇన్‌పుట్స్‌పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకత పెరుగుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయం పెరుగుతుంది. ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి బలపడతుంది. తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు, పెరుగు, పన్నీర్‌ లాంటి నిత్యవసరాలపై పన్ను 5 శాతం నుంచి 0 శాతానికి తగ్గించడం ద్వారా రోజు వారి వ్యయాన్ని తగ్గించినట్టు అవుతుంది. నెయ్యి, వెన్న, వంట పాత్రలపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా కుటుంబ బడ్జెట్‌కి చాలా ఉపశమనం కలిగిస్తుంది. సబ్బులు, షాంపూలు, పేస్టులు వంటి వ్యక్తిగత సంరక్షణ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ద్వారా వాటి ధరలు గణనీయంగా తగ్గుతాయి. తద్వారా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మెరుగవుతుంది. మధ్య తరగతి కోసం కార్లు, ఫ్రిజ్‌ లు, టీవీలు, ఏసీలపై పన్ను 18 శాతానికి తగ్గించడం ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. గృహ నిర్మాణానికి అవసరం అయిన సిమెంటు మీద పన్ను 18 శాతానికి తగ్గించడం నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని పవన్‌ అన్నారు.
ఆరోగ్య రంగానికి ఊతం
ఆరోగ్య రంగంలో ఔషధాలపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికీ, అత్యవసర మందులపై పన్ను 5 శాతం నుంచి 0కి తగ్గించడం ద్వారా రోగులకి కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. జీవిత ఆరోగ్య బీమాపై పన్ను 0 శాతానికి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన పరిస్థితులు మెరుగుపడతాయి. ఎంఎస్‌ఎంఈలకు వ్యాపార ఉత్పత్తులు, మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చులు తగ్గించటంతో పోటీ వాతావరణం పెరుగుతుంది. విద్యా రంగానికి సంబంధించిన వస్తువులపై పన్ను తగ్గింపు విద్యను మరింత అందుబాటులోకి తీసుకువస్తుంది. జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా ప్రజల చేతుల్లో నగదు పెరుగుతుంది. తద్వారా వస్తువుల వినియోగం మరింత పెరిగి నూతన పెట్టుబడుల సేకరణకు ఉపయోగపడుతుంది. వాణిజ్య పరిశ్రమలకు సంబంధించి జీఎస్టీ సంస్కరణల అమలుకి సహకరించిన అన్ని వాణిజ్య సంఘాలు, పారిశ్రామిక సంఘాలకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోందని పవన్‌ స్పష్టం చేశారు.
ప్రజలకు అవగాహన కల్పిద్దాం
జీఎస్టీ సంస్కరణల లాభాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం చేపట్టాలి. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు ప్రజలను నేరుగా కలిసి వారికి ఎలా లబ్ధి చేకూరుతుందో చెప్పాలి. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకుని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలను ఆహ్వానిస్తూ వాటిని విజయవంతంగా అమలు చేసేందుకు సహకరిస్తుందని పవన్‌ తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

సాగుకు మరింత సాయం

Previous Post

వన్‌ నేషన్‌.. వన్‌ విజన్‌ ఎన్డీయే ప్రభుత్వ నినాదమిది..

Next Post

యూరియాపై చర్చకు సిద్ధం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist