చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర అని కితాబు

by చైతన్యరధం
Feb 17, 2026 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజా సాధికారత, సంపద సృష్టి లక్ష్యంగా పనిచేస్తున్నాం
  • బిల్‌గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పాలనా విధానాలపై సీఎం ప్రజెంటేషన్
  • కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలుపై బిల్‌గేట్స్ ప్రశంసలు
  • డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర అని కితాబు

అమరావతి (చైతన్యరథ:): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది దోహదపడుతుందని సీఎం అన్నారు. బిల్‌గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి… ముందుగా గేట్స్, ఆయన బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌తో తన అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 1997లో మొదటిసారి తాను బిల్‌గేట్స్‌ను కలిసి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించానన్నారు. మైక్రోసాఫ్ట్ రాకతో ఇప్పుడు హైదరాబాద్ ఐటీ రంగంలో మేటిగా ఉందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీలో వనరులకు లోటు లేదని, సంపద సృష్టి జరగాల్సి ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని నెం.1 చేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
చంద్రబాబు విజనరీ అని ఆనాడే తెలిసింది
సమావేశంలో మాట్లాడిన బిల్‌గేట్స్… డిజిటల్ విప్లవానికి భారత్‌లో బలమైన పునాదులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చారు. తాను మొదటిసారి చంద్రబాబును కలిసినప్పుడు ఆయన ఆలోచనల్లో ముందుచూపు ఉందనే విషయాన్ని గ్రహించినట్టు వెల్లడించారు. ఈ విషయంలో నాటి సింగపూర్ ప్రధాని మాత్రమే చంద్రబాబుకు కొంత దగ్గరగా ఉన్నారని చెప్పారు. గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులని తెలిపారు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నది తన ఆశయమన్నారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని అభినందించారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో… తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయపడుతుందన్నారు. విద్యా రంగంలో మార్పు తీసుకురావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పిన బిల్‌గేట్స్ వ్యవసాయం రంగం చాలా ముఖ్యమైనదిగా అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం… టెక్నాలజీని రైతులకు అందించేందుకు… ఏఐను వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేస్తూ కృషి చేయడాన్ని అభినందించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐని ఇంతలా వినియోగంచట్లేదని, కానీ ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందుండటం మంచి పరిణామమని చెప్పారు. విపత్తుల నిర్వహణ కోసం టెక్నాలజీతో ముందస్తు అంచనాలు వేసి… ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయడం బాగుందన్నారు. చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ బిల్‌గేట్స్ సరదాగా వ్యాఖ్యానించారు.
పది సూత్రాలతో స్వర్ణాంధ్ర-2047 సాకారం
స్వర్ణాంధ్ర 2047 విజన్, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్‌గేట్స్‌కు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. జీరో పావర్టీ, సంపూర్ణ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత, రైతు-అగ్రి టెక్, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, ఎనర్జీ-ఫ్యూయల్, ప్రొడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్… ఈ పది సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది ఏపీ ప్రభుత్వ విధానమన్నారు. దీనికి ఆధార్ ధ్రువీకరణ, వ్యక్తిగత, కుటుంబ డేటా లేక్, కుటుంబ సమాచారం, రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వ సమగ్ర డేటా, అవేర్ ద్వారా రియల్ టైమ్ డేటా సేకరణ, వాట్సాప్ గవర్నెన్స్, డిజి వెరిఫై వంటి అప్లికేషన్ల వినియోగం ద్వారా భవిష్యత్ కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. టెక్నాలజీ ఆధారిత థీమాటిక్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే క్వాంటం వ్యాలీ-డిజైన్- ఫౌండ్రీగా అమరావతి, డేటా-ఏఐ సిటీగా విశాఖ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, డ్రోన్ సిటీగా ఓర్వకల్లు, ఎలక్ట్రానిక్స్-ఏరో సిటీగా లేపాక్షి, ఎలక్ట్రానిక్స్-స్పేస్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 10 రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 98 ఏఐ యూజ్ కేసులు, 43 హ్యాకథాన్లు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయన్నారు. మొత్తం 7 డేటా లెక్ ప్రాజెక్టులు ప్రారంభించామని చెప్పారు.
2.4 ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీగా రాష్ట్రం
స్వర్ణాంధ్ర-2047 నాటికి ముఖ్య లక్ష్యాలు నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ‘ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఎకానమీని 2.4 ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీగా తీర్చిదిద్దడం, తలసరి ఆదాయం ప్రస్తుతం 3,400 డాలర్లు ఉండగా 2047 నాటికి దీనిని 42,000 డాలర్లకు పెంచడం, ఎగుమతులు 20.7 బిలియన్ డాలర్ల నుంచి 450 బిలియన్ డాలర్లకు పెంచడం, నిరుద్యోగితను 4.1 శాతం నుంచి 2 శాతం కన్నా తగ్గించడం, మహిళా కార్మికుల సంఖ్యను 45.8 శాతం 80 శాతానికి పెంచడం, ప్రస్తుతం 72 శాతంగా ఉన్న అక్షరాస్యతను 100 శాతానికి తీసుకువెళ్లడం, 95 శాతం నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండేలా చూడటం, సగటు ఆయుర్దాయం 85 ఏళ్లు, ఎంఎంఆర్ ప్రతీ లక్ష జననాలకు 5, ఐఎంఆర్ ప్రతి వెయ్యి జననాలకు 2 కన్నా తగ్గించగలగడం, గర్భిణులలో రక్తహీనత సమస్య, వైద్యంపై వ్యక్తిగత ఖర్చు 5 శాతానికి తగ్గించడమే లక్ష్యం’ అని సీఎం చెప్పారు.
విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం
విద్యా రంగంలో అనుసరిస్తున్న ఆధునిక విధానాల గురించి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా తెలియజేశారు. ఇందుకు గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారంపైనా సంతోషం వ్యక్తం చేశారు. లిటరసీ-న్యూమరసీపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టి పెట్టిందన్నారు. 35వేల పాఠశాలల్లో చదువుతున్న 13.4 లక్షల విద్యార్థులకు ఉపకరించేలా ఓఆరఎఫ్ టూల్ వినియోగిస్తున్నామని సీఎం చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాలను బలోపేతం చేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోసం సాంకేతిక సాయం తీసుకుంటున్నామని వివరించారు. ఏఐ ద్వారా సాగుకు సలహాలు అందించడమే కాకుండా, డ్రోన్లు సహా వ్యవసాయ యంత్రాలను అద్దెప్రాతిపదికన వినియోగించుకునేలా అందుబాటులో ఉంచామన్నారు. తెగుళ్లు, చీడపీడలపై ముందస్తు హెచ్చరికలు చేయడం ద్వారా రైతులు నష్టపోకుండా కాపాడటం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను తెలిపారు. గోధార్ ద్వారా పశువుల ఆరోగ్య సంరక్షణ చేపట్టామన్నారు. విద్యుత్-పశుగ్రాసం వినియోగంలో వృధాను తగ్గించగలిగామని చెప్పారు. భూసార పరీక్షలు, మార్కెట్ సలహాలు, సమర్ధ నీటి నిర్వహణ సాగులో పెనుమార్పులు తీసుకువస్తున్నామని వివరించారు.
జూలైకల్లా రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’
వైద్య రంగంలో తెచ్చిన మార్పులు-సాధించిన ఫలితాలను బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. హై లెవెల్ ఎక్స్‌పర్ట్ అడ్వైజరీ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. డబ్లుహెచ్‌వో, అశోకా యూనివర్సిటీ సహకారంతో నేషనల్ హెల్త్ ఏఐ స్ట్రాటజీ వర్క్‌షాప్ నిర్వహించామన్నారు. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్, ఏబీడీఎం (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) అమలు సహా తక్కువ ఖర్చుకే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 71 లక్షల మందికి 41 పరీక్షల ద్వారా స్క్రీనింగ్ పూర్తి చేశామని చెప్పారు. ‘సంజీవని’ కార్యక్రమాన్ని సమగ్ర ఆరోగ్య వేదికగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కుప్పంలో ఇప్పటికే సంజీవని పైలట్ ప్రాజెక్టు చేపట్టగా విజయవంతమైందన్నారు. 2.9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయగా 109 ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 5.2 కోట్ల ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా జూలై 2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఏఐ డాక్టర్‌ను ఇవ్వాలనేది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. టీబీ రోగులకు పోషకాహారం అందిస్తున్నామని, ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో డీఎంఐడీసీ స్థాపించామన్నారు. ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టుగా ‘అమరావతి స్కూల్ ఆఫ్ బయోడిజైన’ చేపట్టామన్నారు.
బిల్‌గేట్స్‌తో మంత్రుల ఇంటరాక్షన్
బిల్‌గేట్స్ పలు అంశాలపై మంత్రులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు కారణమేంటని మంత్రి పయ్యావుల కేశవ్ అడగ్గా….. దీనికి బిల్‌గేట్స్ ఆసక్తికర సమాధానం చెప్పారు. నాడు చంద్రబాబు ఐటీని ప్రమోట్ చేయడం వల్ల టెక్ నిపుణులు చాలా మంది హైదరాబాద్ నుంచే వచ్చేవారన్నారు. అదే సమయంలో చంద్రబాబు మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో పెట్టాలనే ప్రతిపాదన పెట్టారని బిల్‌గేట్స్ తెలిపారు. దీనిపై తమ వద్ద పనిచేసే వారి అభిప్రాయం కోరితే… హైదరాబాద్ సెంటర్ ఏర్పాటు చేస్తే తాము వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పారని వివరించారు. ఇప్పుడు కూడా భారతదేశంలో మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో పని చేసే చాలా మంది ఉద్యోగుల్లో హైదరాబాద్ వారే ఎక్కువగా ఉన్నారన్నారు.
ఏఐ ద్వారా ఆరోగ్య సేవలు ఏ విధంగా అందించవచ్చని బిల్ గేట్స్‌ను మంత్రి సత్యకుమార్ అడిగారు. ఏఐ టెక్నాలజీతో ఆరోగ్య రంగంలో మెరుగైన సేవలు అందించవచ్చని… నాణ్యమైన, నిపుణుల వైద్య సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా అందించే అవకాశం ఉంటుందని గేట్స్ వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి బాబు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా… ఏఐ రాకతో ఉద్యోగాలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని గేట్స్ అభిప్రాయపడ్డారు. అలాగే ఈ వారం ఢిల్లీలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కూడా ఏఐ వల్ల వచ్చే అవకాశాలు, ఎదురయ్యే సవాళ్ల గురించి ప్రపంచంలోని ఏఐ నిపుణులంతా చర్చిస్తారని గేట్స్ వివరించారు.

సంబంధితవార్తలు

అన్నదాతలకు ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతం

Tags: బిల్ గేట్స్ - చంద్రబాబు నాయుడుబిల్ గేట్స్ ఏపీ పర్యటన
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 17-02-2026

Next Post

చదువును దెబ్బతీశారు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-03-2026

కార్యకర్త
@ March 11, 2026
రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం
ఆంధ్రప్రదేశ్

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం
ఆంధ్రప్రదేశ్

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-03-2026

కార్యకర్త
@ March 10, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

మహిళా ద్రోహి జగన్

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత
ఆంధ్రప్రదేశ్

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
వైసీపీ నేతల అక్రమాలపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల అక్రమాలపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ March 10, 2026
దేవేంద్రపాడులో లోకేష్‌కు ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్

దేవేంద్రపాడులో లోకేష్‌కు ఘనస్వాగతం

చైతన్యరధం
@ March 10, 2026
Load More

ముఖ్య వార్తలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
మహిళా ద్రోహి జగన్

మహిళా ద్రోహి జగన్

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist