- జగన్ జమానాలో భ్రష్టుపట్టిన విద్యారంగం
- సమూల ప్రక్షాళనకు చిత్తశుద్ధితో చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
అమరావతి(చైతన్యరథం): జగన్మోహన్ రెడ్డి జమానాలో భ్రష్టుపట్టిన విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబునాయుడి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపికచేసేందుకు రాజకీయాలకు అతీతంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు, విద్యారంగ నిపుణులతో ఎంపిక కమిటీని ఏర్పాటుచేస్తూ జిఓ నెం.343ని విడుదల చేశామన్నారు. ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యుడు రాము సూర్యారావుని ఎంపిక కమిటీ సభ్యుడిగా నియమించామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో విద్యారంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న మా సంకల్పానికి ప్రజలంతా తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.