- పిన్నమ్మ తాళిని తెంపిన వ్యక్తికి ఓటేయ్యాలా?
- స్కామ్ చేసే ఉద్దేశ్యంతోనే ప్రతి స్కీమ్‌కు రూపకల్పన
- ముస్లింల రిజర్వేషన్లను కాపాడతామన్న చంద్రబాబు
అమరావతి, చైతన్యరథం: రాష్ట్రాన్ని అన్ని రకాల గానూ సర్వనాశనం చేసిన జగన్‌రెడ్డి అసలు రాజకీయా లకే పనికిరాడని, ఈ ఎన్నికల్లో అతని పార్టీకి డిపాజిట్లు కూడా రాకూడదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జనం గెలవాలి… రాష్ట్రం నిల బడాలి అంటే జగన్‌రెడ్డికి మళ్లీ తిరిగి రాని విధంగా రాజకీయంగా సమాధి కట్టాల్సిందేనన్నారు. జాతీయ సర్వేల్లో టీడీపీ కూటమికి 20దాకా ఎంపీ స్థానాలు వస్తాయని చెబుతున్నారని, అది అది సరిపోదని, జగన్ రెడ్డి లాంటి వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పాలంటే క్లీన్ స్వీప్ జరగాలని అన్నారు. జగన్‌కు మద్దతు తెలిపే స్వయంప్రకటిత మేధావులు ఎంగిలి మెతుకులకు ఆశ పడి సపోర్టు చేయవద్దని హితవు చెప్పారు. దుర్మార్గు లను సపోర్టు చేస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుం దన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ముం దుకు రావాలని, చిత్ర విచిత్రమైన లీలలు మన రాష్ట్రం లోనే జరుగుతున్నాయని, లేని ఆస్తులు ఉన్నట్లు…ఉన్న ఆస్తులు లేనట్లు చూపిస్తారన్నారు. బాబాయిని గొడ్డలితో లేపేశాం.. అరెస్టులు కాకుండా కాపాడామని అనుకుం టున్నారని అన్నారు. ‘ఇంటి దొంగను గుర్తించలే పోయాం. బాధల్లో ఉండి పట్టించుకోలేదు… జగన్ ఉదయం రావాల్సి ఉంది… సాయంత్రం వచ్చాడు. హెలికాప్టర్ అరగంటలో వెళ్లాల్సిన వ్యక్తి రోడ్డు ప్రయాణంలో సాయంత్రానికి వచ్చాడు. హత్యపై కోర్టు కు వెళ్లాలి.. సీబీఐ విచారణ అడగాలన్నప్పుడు వద్దు అని జగన్ చెప్పాడు. దీంతో మాకు అవమానం కలిగింది. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిని జగన్ కాపాడారు. హత్యలో జగన్, భారతి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్ర ఉంది…వైసీపీకి ఓటేయొద్దు. తాము పోరాడుతుంటే అల్లుడు, చెల్లెలుపై కేసులు పెట్టి వేధిస్తున్నారు’ అని వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ అన్నారని చంద్రబాబు తెలిపారు. మానవత్వం ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అబద్ధాల కోరును ప్రజలు నమ్మాలా అని ప్రశ్నించారు. పిన్నమ్మ తాళిని తెంపిన వ్యక్తికి ఎవరైనా ఓటేస్తారా అని అడిగారు. ప్రతి స్కీమ్ రూపకల్పన వెనుక స్కామ్ చేసే ఉద్దేశమేనని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఇప్పటికి 12 లక్షల కోట్లకు అప్పు చేరిందని, ఇక అప్పులు ఇచ్చేవాళ్లు లేక రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెడుతున్నారని చెప్పారు.
ముస్లింల రిజర్వేషన్లు కాపాడతాం
సిఏఏ అమలుపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ ‘ఏ దేశానికి వెళ్లినా సిటిజన్ షిప్ అవసరం. ఎప్పుడో ఒకసారి సిటిజన్ షిప్ తీసుకోవాల్సిందే. ఇది రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం అవుతుంది. అభద్రతాభావం ఎవరికి ఉంటుంది..దొంగతనంగా వచ్చేవారికి ఉంటుంది. ఉద్యోగాల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి…వాటిని మేం కాపాడుతాం. ముస్లింలలో పేదలు, వెనకబడిన వారు ఉన్నారు..వారికి చేయూత ఇవ్వడం మా బాధ్యత. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ దేశాలు…ఇలా ఏ దేశంలో అయినా రూల్స్ ప్రకారం సిటిజన్ షిప్ ఉంటుంది. దేశం కోసం ఆలోచించే వ్యక్తులు కొన్నికొన్ని ఆమోదించాలి’’ అని అన్నారు. పొత్తు పెట్టుకున్నాక పార్టీలో చిన్నచిన్న సమస్యలు వస్తాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని, మూడు పార్టీల నేతలు, కార్యకర్తలను కూడా మేము కోరుతున్నామని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. తమ పార్టీలో కూడా కేసులకు గురై పోరాడిన వారిలో కూడా కొంత మందికి సీట్లు రాలేదని, వారిలో కూడా బాధ, ఆవేదన ఉంటుందన్నారు. 2014-19 మధ్య కేంద్రం నుండి హోదా తప్ప అన్ని పనులు జరిగాయని, అమరావతికి రూ.2,500 కోట్ల నిధులు, పోలవరంతో పాటు రోడ్లు వేశారని, నరేగా నిధులు బ్రహ్మాండంగా వినియోగించుకున్నామని చంద్రబాబు చెప్పారు.