అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో పున: ప్రారంభమైన అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చే విషయంలో విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 203 అన్న క్యాంటీన్‌లు ప్రారంభించబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గురువారం గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 99 చోట్ల అన్న క్యాంటీన్‌లు పార్రంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెప్టెంబరు చివరి నాటికి మొత్తం 203 అన్న క్యాంటీన్‌లు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్న క్యాంటీన్ పున: ప్రారంభంపై మంచి స్పందన వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. సాధారణ ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, వృద్ధులు సైతం తరలి వచ్చి అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇస్తున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.2 కోట్లకు పైగా విరాళం ప్రభుత్వానికి అందింది. వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు విరాళాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అన్న క్యాంటీన్ల నిర్వహణ చూస్తున్న మునిసిపల్ శాఖ విరాళాల స్వీకరణకు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరిచింది. విరాళాలు పంపించాలనుకునేవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఖాతాకు నేరుగా ఆన్‌లైన్ విధానంలో లేదా చెక్ రాసి పంపవచ్చు.
ఖాతా వివరాలు:
చీaఎవ:- ANNA CANTEENS
A/C.no. 37818165097
Branch:- SBI,CHANDRMOULI NAGAR, GUNTUR
IFSC : SBIN0020541
ఈ అకౌంట్ కు విరాళాలు పంపవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. గుడివాడలో జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ వివరాలు ప్రకటించారు. ప్రజల భాగ్వస్వామ్యంతో ఒక స్ఫూర్తి నింపేలా అన్న క్యాంటీన్ల నిర్వహణ ఉంటుందని సీఎం అన్నారు.