అమరావతి (చైతన్యరథం): ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన కోనేరు హంపికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. 2024.. మన దేశ చెస్ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరం అన్నారు. కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన విజయంతో దేశ ప్రతిష్టను పెంపొందించిదని ప్రశంసించారు.