టిడిపితోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంతర్యం
బిసిలను తప్పుడు కేసులతో వేధిస్తున్న జగన్
అధికారంలోకి వచ్చాక బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం
ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్
టిడిపితోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం కారుమంచిలో బీసీ సామాజికవర్గ ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టిడిపి. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం. టిడిపి హయాంలో ఆర్ధిక శాఖ, టిటిడి, తుడా ఛైర్మెన్ లాంటి కీలక పదవులు బిసిలకు ఇచ్చాం. మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. జగన్ పాలనలో నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బిసిలకు 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బిసిలకు పదవులు దక్కకుండా చేశారు జగన్.
బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం చెయ్యమని అడిగితే బెంజ్ మంత్రి బిసిల పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బెంజ్ మంత్రి వాల్మీకిలకు చేసింది ఎంటి? ఆయన బెంజ్ కారులో తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాల్మీకిలకు చిన్న కారు కొనుక్కునే స్థితిలో అయినా ఉన్నారా? బెంజ్ మంత్రి వందల ఎకరాలు అధిపతి అయ్యారు. ఇక్కడ ఉన్న వాల్మీకిలు ఒక్క ఎకరం కొనే పరిస్థితి ఉందా? ఇటినా భూములు పై ఛాలెంజ్ చేసా.
ప్రభుత్వ ధర చెల్లిస్తే భూములు రైతులకు రాసిస్తా అని బెంజ్ మంత్రి అన్నారు. ఆ డబ్బులు మేము చెల్లిస్తాం అని చెప్పా. ఆ భూములు రైతుల పేరిట రాయడానికి బెంజ్ మంత్రి సిద్దమా? వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చేందుకు టీడిపి సత్యపాల్ కమిటీ వేసాం, అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. నాలుగేళ్లు డ్రామా చేసిన జగన్ ఇప్పుడు బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేరుస్తామని కొత్త తీర్మానం అంటున్నాడు. వాల్మీకిలకి టిడిపి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎస్టీల్లో చేర్చేందుకు కేంద్రం తో పోరాడతాం అని వెల్లడించారు.
బిసిలను వేధిస్తున్న జగన్
బిసిలను జగన్ ప్రభుత్వం వేధిస్తుందని లోకేష్ ఆరోపించారు. సుమారుగా బిసిల పై 26 వేల కేసులు పెట్టారు. అందుకే ప్రత్యేక బిసి రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసిల్లో ఉన్న ఉపకులాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం. స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ల ద్వారా నిధులు మంజూరు చేస్తాం. బిసిలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ క్లస్టర్ల లో బిసిలకు రిజర్వేషన్ కల్పిస్తాం. సొంత మద్యం వ్యాపారం కోసం జగన్ కల్లు గీత కార్మికులను వేధిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ప్రారంభిస్తాం. మద్యం దుకాణాల్లో కల్లు గీత కార్మికులకు రిజర్వేషన్ కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పనిముట్లు అందిస్తాం, చెట్ల పెంపకం కోసం సహాయం, భీమా కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.
వడెర్ల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. వడెర్ల కోసం మైన్లు కేటాయించింది టిడిపి. ఆ మైన్ల ను వైసిపి నాయకులు లాక్కున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ మైన్లు మీకు తిరిగి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలను విద్యకి దూరం చేస్తుంది జగన్ ప్రభుత్వం. ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి లేకుండా నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తాం. పదో తరగతి ఫెయిల్ అయిన జగన్ కి క్రీడల విలువ ఏమి తెలుస్తుంది. రాయలసీమ కి స్పోర్ట్స్ యునివర్సిటీ తీసుకొస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. బీరప్ప దేవాలయాలు నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తాం. అలాగే పూజారులను గౌరవ వేతనం ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
గొర్రెలకు ఇన్సూరెన్స్ కల్పిస్తాం
కురబ సామాజిక వర్గం వారి కోసం టిడిపి హయాంలో గొర్రెలు కొనడానికి రుణాలు అందించామని లోకేష్ చెప్పారు. మందులు, మేత, దాణా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీ లో మందులు, మేత, దాణా అందజేస్తాం. గొర్రెలకు ఇన్స్యూరెన్స్ సదుపాయం కల్పిస్తాం. డప్పు కళాకారులని ఆదుకుంటాం. బీసీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. యాదవ సామాజిక వర్గాన్ని ఆదుకుంది టిడిపి. యాదవ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసింది వైసిపి అని ఆరోపించారు.
బిసి సామాజికవర్గీయులు మాట్లాడుతూ…
కల్లుగీత కార్మికులను జగన్ ప్రభుత్వం వేధిస్తోంది. భీమా కూడా లేదు, చెట్ల పెంపకానికి బీడు భూములు ఇవ్వాలి. వడ్డెర కులస్తులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది. మాకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు పడటం లేదు. కాలేజీ వాళ్ళు డబ్బులు కట్టాలని వేధిస్తున్నారు. బీసీ క్రీడాకారులను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. బిసి సర్టిఫికేట్లు తీసుకోవడంలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. యాదవ సామాజిక వర్గానికి వైసిపి హయాంలో తీవ్ర అన్యాయం జరిగింది అని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
రాజశేఖర్ గౌడ్, కల్లుగీత కార్మికుడు, దేవనకొండ : మీ ప్రభుత్వంలో గీత కార్మికులకు బీమా ఉండేది..ఇప్పుడు ఎత్తేశారు. కల్లు చెట్లన్నీ నరికేశారు. చెట్లు నాటుకోవడానికి బీడు భూములు ఇవ్వాలి. దేవనకొండలో హాస్టల్, మోడల్ స్కూల్ లేదు. హాస్టల్ సౌకర్యం కల్పించాలి.
రమేష్, ఆలూరు : వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి. రాళ్లు కొట్టుకుని చనిపోయేవారికి బీమా ఏర్పాటు చేయాలి.
సత్యయాదవ్ : నేను ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. రెండవ సంత్సరంలో నాలుగవ సెమిస్టర్ అయ్యాక కూడా ఫీజు రీయింబర్స్ పడలేదు. ఫీజు కడితేనే మళ్లీ పరీక్షలు రాయనిస్తాం అన్నారు. సచివాలయానికి వెళ్లి అడిగినా ఫలితం లేదు. నేను నేషనల్ ప్లేయర్. టీడీపీ ప్రభుత్వంలో రూ.1.7 లక్షలు మాకు ప్రోత్సాహకాలు అందాయి. ఈ ప్రభుత్వంలో మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
జగదీష్, వాల్మీకీ : బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు వచ్చేవి..ఇప్పడు రాలేదు. 2018లో డిగ్రీ అయింది..నేను వ్యవసాయమే చేస్తున్నా. ఈ ప్రభుత్వంలో పనిముట్లు, సబ్సీడీలు అందడం లేదు.
రామనాథ్ యాదవ్ : తిరుపతిలో సన్నిధిగొల్లలో గొల్లలను మాత్రమే కంటిన్యూ చేయాలి. యాదవ కార్పొరేషన్ ద్వారా రూ.2 వేల కోట్లు నిధులు కేటాయించాలి. రాజధానిలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలి.