అమరావతి : చంద్రబాబు నాయుడి కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ నిజంగా తమ హృదయాలను ఉప్పొంగించిందని ఆయన కోడలు నారా బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి ఒక రాజనీతిజ్ఞుడు మాత్రమే ఈ విధంగా తెలుగు సమాజాన్ని హృదయపూర్వకంగా స్పందింపజేయగలిగారని ఆమె కొనియాడారు. 52 రోజులపాటు ఆయన బయటలేకున్నా ప్రజలను ఏకం చేసిన తీరుకు ఆశ్చర్యపోవాల్సిందేనని అన్నారు. గడిచే ప్రతి రోజూ చంద్రబాబు మద్ధతును రెట్టింపు చేస్తున్నట్టుగా ఉందని బ్రాహ్మణి అన్నారు. నిజాయతీగా, ముక్కుసూటిగా వ్యవహరించే రాజనీతిజ్ఞుడి ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ఎంత ప్రయత్నించినా సత్యం ఏంటో ప్రజలకు తెలుసునని, వాళ్లంతా చంద్రబాబు పక్షాన బలంగా నిలబడతారని ఆమె ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’పై ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు.