- ఎప్పటికప్పుడు వివరాలు అందులో నమోదు చేయాలి
- ఎడమకాలువలో మిగిలిన పనులు ప్రారంభించాలి
- లైనింగ్ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలి
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశం
- డిసెంబర్ మొదటివారంలో సీఎం సందర్శిస్తారని వెల్లడి
- సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లపై సూచనలు
- ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష
అమరావతి(చైతన్యరథం): పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏరోజు ఎంత పని జరిగిందో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్ రూపొం దించి పనుల వివరాలు అందులో నమోదుచేయాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. డిసెంబర్ మొదటివారంలో పోలవరం ప్రాజెక్టును సంద ర్శించి డయాఫ్రం వాల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తారని వెల్లడిరచారు. సచివాలయంలో బుధవారం రాష్ట్రంలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం, ఈసీఆర్ ఎఫ్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రాజెక్ట్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ తయారు చేసిన వర్క్ షెడ్యూల్‌పై సమీక్ష నిర్వహించారు.
డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు మొద లు పెట్టడానికి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలనే దానిపై చర్చించారు. దీంతో పాటు ప్రాజెక్టులో కుడి, ఎడమ కాలువలను కలిపే సొరంగాల నిర్మాణాల్లో మిగిలి న తవ్వకం పనులు, అదేవిధంగా లైనింగ్ పనులను వెంటనే మొదలుపెట్టి నిర్ణీత వ్యవధి లోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం ఎడమ కాలువ పనులకు సంబంధించిన మిగిలిన పనులను పూర్తిచేయడానికి వీలుగా ఇప్పటికే టెండర్లు పూర్తికా గా పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. భూసేకరణ, పునరావాసం, నిర్వాసితులకు అందించాల్సిన నష్టపరిహారానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు.
సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
డిసెంబర్ 8న జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధం గా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాగునీటి సంఘాల ద్వారా కాలువ లు, డ్రైన్స్ వంటి ఇరిగేషన్ పనులలో రైతుల భాగస్వామ్యంతో పాటు వారికి ప్రాతినిధ్యం లభిస్తుందని మంత్రి తెలిపారు. వీటితో పాటు హంద్రీ-నీవా, వెలిగొండ, చింతలపూడి, గోదావరి పెన్నా నదుల అనుసంధానం, బుడమేరు, ఐడీసీ రిపేర్లు, ఇరిగేషన్‌లో అత్యవస రంగా చేపట్టాల్సిన పనులు, గోదావరి డెల్టా డీపీఆర్‌లపై సంబంధిత అధికారులు, కాం ట్రాక్ట్ ఏజెన్సీలతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, కడ కమిషనర్ రాంసుందరరెడ్డి, ఈఎన్సీ ఎం.వెం కటేశ్వరరావు, పోలవరం సీఈ నరసింహమూర్తితో పాటు పలు ప్రాజెక్టుల సీఈలు, ఎస్‌ఈలు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.