- లిక్కర్ స్కామ్‌తో కదులుతున్న ప్యాలెస్ కూసాలు
- మాజీమంత్రి అయ్యన్నపాత్రడు
విశాఖపట్నం : ఎ2 ఫోన్ పోలేదు.. పడేశాడు, డిల్లీ లిక్కర్ స్కామ్‌తో తాడే పల్లి ప్యాలెస్ కూసాలు కదిలిపోతున్నాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవాచేశా రు. సీఎం జగన్ పరిస్థితి డేరాబాబాలా తయారైంది. నలుపురంగు చున్నీలు వేసుకొచ్చారని వాటిని లాక్కోవ డం మహిళలను అవమానించడమేనని పేర్కొన్నారు. విశాఖలోని తెలుగు దేశంపార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… దేశంలో ఏ సీఎం ఇంత వరస్ట్‌గా పనిచేయడం లేదు. విశాఖలో గంజాయి అరి కట్టామని డీజీపి అనడం కరెక్ట్ కాదు. ఎన్ని గంజాయి కేసులు పరిష్కారం చేశారో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐఎఎస్, ఐపిఎస్ లు రాష్ట్రానికి పిల్లర్లు లాం టివారు, వారు చట్టానికి ప్రతినిధులుగా ఉంటూ న్యా యబద్ధంగా వ్యవహరించాలి. పీవీ నరసింహారావు సీఎం గా వున్నప్పుడు హైదరాబాద్‌లో అల్లర్లు జరుగు తున్నాయి. సంఘటన స్థలానికి వెళ్ళొద్దని చీఫ్ సెక్రె టరీ సూచించారు. సీఎం వినకపోతే కారు తాళాలు వేసి జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత రోజు వాస్తవం తెలుసుకున్న సీఎం పివి, చీఫ్ సెక్రెటరీని అభినందించారని అయ్యన్న గుర్తుచేశారు. పోలీసులు జగన్ చెప్పినట్టు చేస్తున్నారు. సీనియర్ ఐఎఎస్ కృష్ణబాబు లాంటివారు కూడా ఇపుడు అబద్ధాలు చెబుతున్నారు. జీవోలే లేకుండా 17 మెడికల్ కాలేజీలు ఎలా ప్రారంభిస్తారు, జీవో ఇచ్చింది మూడిరటికేనని తెలిపారు. విశాఖలో మూడేళ్ళుగా మంచాన వున్న బాధితుడు వై సంతోష్ కు రెండు లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన హ్యూమన్ రైట్స్ కమిషన్ కు అయ్యన్నపాత్రడు ధన్యవాదాలు తెలిపారు.