అమరావతి (చైతన్యరథం): చిత్తూరు జిల్లా రాజకీయ కారణాలతో పోలీసు అధికారులను బదిలీ చేస్తున్నారని, వీటిని నిలువరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. చిత్తూరుజిల్లా ఎస్పీ కొంత మంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయా లంటూ సీఈఓకు రాసిన లేఖలో అచ్చెన్నాయుడు కోరారు. ఈ నెల 14వ తేదీన చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల షెడ్యూల్ వస్తుండగా, చివరి నిముషంలో చేసిన ఈ బదిలీలకు కారణం ఏమిటి? బదిలీ కోసం పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల నుంచి ఎటువంటి విన తులు రాకపోయినా బదిలీచేయాల్సిన అవసరంఏంటి? రాజకీయ ప్రేరే పితమైన ఈ బదిలీలను వెంటనే రద్దు చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.