- చంద్రబాబు నిర్ణయంతో రైతుల్లో ఆనందం
- గత ప్రభుత్వంలో కమీషన్ల కోసమే ఆమోదం
- షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టిన జగన్‌రెడ్డి
- విద్యుత్ ఆదా అంటూ ఊదరకొట్టి అబద్ధాలు
- ప్రయాస్ ఎనర్జీ నివేదకతో వాస్తవాలు బట్టబయలు
- దోపిడీ ప్లాన్‌కు చెక్ పెట్టిన కూటమి ప్రభుత్వం
మన దేశంలో వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా కొనసాగుతోంది. వ్యవసాయం లోనే సాయం ఉంది.. ప్రతి రైతుకు సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారి ఎప్పటికప్పుడు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వాల ముందు ఒక ప్రధాన బాధ్యత. అయితే, ఈ సాంకేతిక యుగంలో విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్ల ప్రవేశపెట్టడాన్ని అసరాగా తీసుకున్న గత వైసీపీ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 18.58 లక్షల కనెక్షన్లు స్మార్ట్ మీటర్లు ఏర్పా టుకు చర్యలు చేపట్టింది. వీటి విలువ రూ.6500 కోట్లు.. అంటే ఒక్కొక్క స్మార్ట్ మీటరు కు సుమారుగా రూ.35,000 వరకు ఖర్చు చేసింది. 2 శాతం అదనపు రుణం కోసమే మీటర్ల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకున్నా నిర్వహణ పేరుతో పెద్దఎత్తున దోపిడీకి వేసిన ప్లాన్‌ను కూటమి ప్రభుత్వం నీరుగార్చడంతో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు బిగ్ షాక్ తగిలిన ట్లయింది. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉండటంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతుల మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
కమీషన్ల కోసమే స్మార్ట్ మీటర్లకు ఆమోదం
ఏపీలో స్మార్ట్ మీటర్ ధర రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ఉంటుంది. తమిళనాడులో రూ.4,500, తెలంగాణలో రూ.5,500, కర్ణాటకలో రూ.5,000. దీని ప్రకారం చూస్తే ఒక్క స్మార్ట్ మీటర్ల కొనుగోలు విషయంలో ఎంతలా అవినీతి పాల్పడ్డారో అర్థమవుతుంది. సుమారు రూ.2000 కోట్ల వరకు అవినీతికి పాల్పడినట్లు సమాచారం. కమీషన్ల కోసమే జగన్‌రెడ్డి పాలనలో స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారన్న విమర్శలూ వచ్చాయి. ఈ ప్రాజెక్టు కింద 18.58 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా రైతుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. స్మార్ట్ మీటర్లతో తమపై అదనపు ఆర్థిక భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జగన్‌రెడ్డి స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనా లు ఉంటాయనే దానిపై పైలెట్ ప్రాజెక్టులు లేకుండానే ముందుకు వెళ్లింది. రైతులు, ప్రజా సంఘాల వ్యతిరేక తను సైతం పట్టించుకోకుండా రైతుల నుంచి వచ్చే వ్యతిరేకత ను కప్పిపుచ్చుకునేందుకు అంగీకార పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టించినట్లు అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్మార్ట్ మీటర్ల కనెక్షన్ల ప్రతిపాదనను రద్దు చేసింది. దాంతో రైతుల కళ్లలో సం తోషం కనిపిస్తోంది. ఈ నిర్ణయంతో ఆర్థిక భారం తగ్గి..కరెంట్ బిల్లు తగ్గుతుందని ఆనందంగా ఉన్నారు.
స్మార్ట్ మీటర్ల అవసరమే లేదు: ప్రయాస్ నివేదిక
‘‘వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే విద్యుత్ ఆదా అయింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టుతో ఇది రుజువైంది’’ అంటూ గత వైసీపీ ప్రభుత్వం ఊదరగొట్టింది. ఈ మాటల్లో నిజం లేదని.. పైగా ప్రజాధనం వృథా అని పైలెట్ ప్రాజె క్టుపై ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ (పీఈజీ)తో ఆర్థికశాఖ చేయించిన అధ్యయనంలో తేలింది. పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర మీటరింగ్, ఫీడర్ మీట రింగ్ విధానంలో కొద్ది మొత్తం అదనపు ఖర్చుతో విద్యుత్ ఆడిట్‌కు అవకాశం ఉందని పీఈజీ నివేదికలో పేర్కొంది. దీని ఆధారంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం, నష్టాలను తేలిగ్గా అంచనా వేయొచ్చని అని పీఈజీ చెప్పినా.. భారీ మొత్తం వెచ్చించి ప్రజలపై భారం వేయడానికే జగన్ ప్రభుత్వం మొగ్గుచూపింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజె క్టుగా 28 వేల మోటార్లకు ఐఆర్‌డీఏ మీటర్లు అమర్చి వాటి ద్వారా ఏడాదిలో రైతుల కోసం ప్రభుత్వం చెల్లించే రాయితీ మొత్తంలో 28-36% ఆదా చేయగలిగామని లెక్కలు చూపి..స్మార్ట్‌మీటర్లకు పెట్టే రూ.6,500 కోట్లను ఐదేళ్లలో వెనక్కి రాబట్టుకోగలమని సమర్థించుకునే ప్రయత్నాన్ని గత ప్రభుత్వం చేసింది.
టెండర్లు జగన్‌రెడ్డి బినామీకే
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్.. ఈ సంస్థ గురించి మాట్లాడాలంటే వైసీపీ అధికా రంలోకి రాకముందు.. వచ్చిన తరువాత అని చెప్పుకునే స్థితికి గత ప్రభుత్వం తీసుకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హవా మామూలుగా లేదు. ఈ సంస్థ ముందు ఎటువంటి నిబంధనలు పనిచేయవు. ఈ సంస్థ తన బినామీ నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి కడప జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. 18.58 లక్షల వ్యవసా య మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కాంట్రాక్ట్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, కేంద్రం టెండ ర్లు పిలిచిన సోలార్ ప్యానళ్ల తయారీ ప్రాజెక్టు సహా కేవలం ఏడాదిలోనే రూ.92 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆ సంస్థకే దక్కాయంటే దానికి కారణం జగన్‌రెడ్డి ప్రభుత్వం. అస్మదీయులకు ఏ రకంగా దోచిపెట్టారో చెప్పడానికి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు చేకూరిన లబ్ధే ఉదాహరణ. ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టి కనీవినీ ఎరుగని ధరలను చెల్లించేందుకు పెద్ద కథే నడిపింది. మొదట మీటర్ల తయారీ కంపెనీలు బిడ్లు వేయాలని నిబంధన పెట్టినప్పటికీ దాన్ని తీసేసింది. కనీసం రూ.వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీకే అర్హత కల్పిస్తూ డిస్కంలు నిబంధనలు మార్చేశాయి. దీంతో షిర్డీసాయి సంస్థకు మీటర్లు, అనుబంధ పరికరాల తయారీ యూనిట్లు లేకపోయినా బిడ్ దాఖలుకు అనుమతి లభిం చింది. మీటర్లనే తయారు చేస్తున్న ఓ మాదిరి కంపెనీలు కొత్త నిబంధనలతో అర్హత కోల్పోయాయి. ఆదానీ కంపెనీ పాల్గొన్నా అది ఎల్2గానే మిగిలిపోయింది. వైసీపీ ప్రభు త్వ హయాంలో పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను కూడా షిర్డిసాయికే కట్టబెట్టింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా కడపను ఆనుకుని సీపీ బ్రౌన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ పేరుతో ఐటీ సెజ్ ఏర్పాటుకు 52.45 ఎకరాలను నోటిఫై చేసి వసతులను కూడా కల్పించింది. అందులో 49.8 ఎకరాలను షిర్డీసాయి సంస్థకు కేవలం రూ.42.48 కోట్ల కే జగన్ సర్కారు కట్టబెట్టింది. ఆ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.150 కోట్ల వరకు ఉంటుంది.
చంద్రబాబు రైతుల పక్షపాతి
తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర విశేషం. రైతుల పక్షపాతిగా ఆయన తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. తన పాలనా కాలంలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీ, నీటి పారుదల ప్రాజెక్టులు, రైతు భరోసా వంటి కార్యక్రమాలు ఆయనకు రైతులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. నదుల అను సంధానంతో సాగునీటిని అందించేందుకు కృషి చేశారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యా లు, నూతన సాంకేతికత వినియోగం, ఆర్థిక సహాయం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహిం చారు. ఈ చర్యలు రైతుల్లో ఆయనపై అపారమైన అభిమానాన్ని, నమ్మకాన్ని కలిగిం చాయి. అందుకే రైతుల పక్షపాతిగా చంద్రబాబు తన మార్క్ చాటుకున్నారు.
` సాయికల్యాణ్, అనలిస్ట్