- సేఫ్టీ ఆడిట్‌ను థర్ట్ పార్టీకి ఇచ్చి లంచాలు దోచుకున్నారు
- దీనిపై సాంకేతిక నిపుణులతో సమీక్ష చేయిస్తాం
- పెద్దిరెడ్డి, ఆయన టీం చేసిన దందాతో ప్రజలకు ఇబ్బందులు
- ఇసుకలో కోట్లు నొక్కేసి నేడు జగ్గిరెడ్డి వేదాలు వల్లిస్తున్నారు
- ధాన్యం డబ్బు చెల్లించకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారు
- రూ.3000 వేల కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధులను మళ్లించారు
- ఈఎస్ఐ ఆసుపత్రుల నిధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు
- వైసీపీకి కొమ్ముకాసిన అధికారులు మారాలి..ఇకపై ఆటలు సాగవు
- ఎక్కడ రూల్స్ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం
- దోపిడీ చేసి అబద్దాలతో ప్రెస్మీట్లు పెడితే ప్రజలు నమ్మరు
- కార్మిక, కర్మాగార, బాయిలర్స్, వైద్య బీమా సేవల మంత్రి వాసంశెట్టి
మంగళగిరి(చైతన్యరథం): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనుభవం లేని అధికారులను నియమించి థర్డ్ పార్టీ చేతిలో సేఫ్టీ ఆడిట్‌ను పెట్టి లంచాలు కొల్లగొట్టడంతోనే నేడు ఫ్యాక్టరీలలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్, వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఉచిత ఇసుకపై జగ్గిరెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. గత ఐదేళ్లు ఇసుక మాఫియాను గుప్పిట్లో పెట్టుకుని కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి జగ్గిరెడ్డి అని, ఇసుకను గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని విమ ర్శించారు. వైసీపీ పాలనలో ఇసుకలో రూ.9750 కోట్లు కొట్టేశారని పేర్కొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల నిధులను దారిమళ్లించారు
సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వైసీపీ అరాచక పాలనలో రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు. సుమారు రూ.3000 కోట్ల భవన నిర్మాణ కార్మికులకు చెందిన నిధులను దారిమళ్లించారు. ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.400 కోట్లలో రూ.300 కోట్లు తిరిగి కేంద్రానికి పోయింది. అంటే వైసీపీ అసమర్థత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ లేదని, వారి అరాచక పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఖజానాను ఖాళీ చేసి ధాన్యం డబ్బులు కూడా చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెట్టారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1000 కోట్లు చెల్లించి రైతులను ఆదుకున్నామని తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం
ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అబద్దాలతో అవగాహన లేని ప్రెస్మీట్లు పెడుతున్నారు. నిరుద్యోగుల సమస్యలపై జగ్గిరెడ్డి మాటలు హాస్యాస్పదం గా ఉన్నాయి. వికాస సంస్థతో ద్వారంపూడి దోపిడీ గురించి అందరికీ తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీనే రూ.7000 పింఛన్ ఇచ్చాం. సూపర్ సిక్స్‌లో భాగంగా నిరు ద్యోగ భృతి, మెగా డీఎస్పీ విడుదల చేస్తామని చెప్పాం. అన్నట్లుగానే మెగా డీఎస్సీకి ఏర్పా ట్లు జరుగుతున్నాయి. దానిపై సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే సంతకం చేశా రు. నిరుద్యోగ భృతికి మేము కట్టుబడి ఉన్నాం. స్కిల్ సెన్సెస్‌తో ఉపాధి కల్పన కృషి చేస్తాం. చంద్రబాబు పాలనలో ఖచ్చితంగా ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మీ అవినీతి అరాచక పాలనకు ఫలితమే.. మీకు వచ్చిన 11 సీట్లు. అధికారం కోల్పోయిన మీరు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. టీవీలు చూస్తూ ఉండండి మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, పవన్‌కళ్యాణ్, లోకేష్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రను తయారు చేస్తాం.
విచ్చలవిడిగా లైసెన్సులు…వైసీపీ నేతల పాపాలతో ప్రమాదాలు
ఇటీవలే పలు ఫాక్టరీలలో ప్రమాదాలు జరిగి నలుగురు చనిపోవడం చాలా బాధా కరం. నేడు అచ్చుతాపురంలో వసంత్ కెమికల్స్‌లో కూడా ప్రమాదం చోటుచేసుకుని ప్రదీప్ అనే వ్యక్తి మరణించాడు. అలాగే సామర్లకోట మండలం అచ్చంపేటలోని జనని కాంక్రీట్ రెడీ మిక్స్ కంపెనీలో ప్రమాదం జరింది. ఈ ప్రమాదంలో 18 ఏళ్ల యువకుడు రెడిమిక్స్ మిల్లో పడి మృతిచెందాడు. యాజమాన్యాలు మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. ఎక్స్‌గ్రేషియాను పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అను భవం లేని అధికారులను నియమించడం, సేఫ్టీ ఆడిట్ అనే దాన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీలకు ఇచ్చి లంచాలు దోచుకుని విచ్చలవిడిగా లైసెన్స్‌లు జారీ చేయడంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సేఫ్టీ అడిట్పై సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో సమీక్ష చే స్తాం. అన్ని ఫ్యాక్టరీలు, బాయిలర్స్ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించాం.
పెద్దిరెడ్డి దందాతో ప్రజలకు ఇబ్బందులు
ఏపీ జెన్ కో 1800 మెగావాట్ల ప్రాజెక్టుపై నాలుగేళ్లు నిర్లక్ష్యంగా ఉండి హడావిడిగా ఎన్నికల ముందు అసంపూర్తి ప్రాజెక్టులను ప్రారంభించడంతోనే ప్రమాదం చోటు చేసుకుం ది. బూడిద తింటానికి పెద్దిరెడ్డి, ఆయన టీం చేసిన దందా వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం థర్డ్ పార్టీలతో ఫ్యాక్టరీలను బెదిరించి డబ్బులు దోచుకున్నా రు. థర్ట్ పార్టీ, అధికారులు కుమ్మక్కై ఫ్యాక్టరీలలో భద్రతా చర్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇకపై ఎక్కడైనా రూల్స్ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. వైసీపీ పాలనలో అక్రమాలకు అలవాటుపడిన అధికారులు ఇప్పటి కైనా మారాలి.. ఇకపై వారి ఆటలు సాగవని హెచ్చరించారు.