అమరావతి: పోలీసు కస్టడీలో ఉన్న టీడీపీ సానుభూతిపరులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డీఎస్పీపై డీజీపీ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇంత దారుణంగా హింసకు తెగబడతారా అని శుక్రవారం ఆయన ట్విటర్ లో ప్రశ్నించారు. ఇది ఇంకా డీజీపీ దృష్టికి రాలేదా అని అడిగారు. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. రాజ్యాంగం అనేది ఒకటి ఉందని ఏపీలో అధికార పార్టీ ఎప్పుడో మర్చిపోయిందన్నారు. కొందరు పోలీసు అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని, అటువంటి అధికారు లను సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత డీజీపీపై ఉం ఓదని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోని పక్షంలో దీనిపై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.