- అసమ్మతి స్వరాన్ని అణిచివేస్తున్న పోలీస్ శాఖ
- హైకోర్టు డీజీపీని హెచ్చరించినా మార్పురాలేదు
- బాబు పర్యటనలో జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసుల వైఫల్యం
- డీజీపీకి లేఖ రాసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో దాడులు చేసిన అధికార పార్టీ గూండాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం డీజీపీకి లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటనకు అధికారులందరి నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు 1989 నుంచి ఇప్పటి వరకు 7సార్లు కుప్పంకి ప్రాతినిధ్యం వహి స్తున్నారని, 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేశారని, జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకులని వివరించారు.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి పోలీసుశాఖ ఆర్టికల్ 19ను ఉల్లంగిస్తూ అసమ్మతి స్వరాన్ని అణిచివేస్తోందన్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ హైకోర్టు డీజీపీని సైతం అనేకమార్లు పిలిపించి ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించడంలో మరింత జాగ్రత్త వహించాలని హెచ్చరించినప్పటికీ వారి తీరు మారలేదని పేర్కొన్నారు. కుప్పం పర్యటనకు అనుమతి ఉన్నప్పటికీ చంద్రబాబు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ భరత్ నేతృత్వంలో చంద్రబాబు కాన్వాయ్‌పై అడుగడుగునా దాడి చేశారన్నారు. ర్యాలీలో పాల్గొన్న టీడీపీ మద్దతుదారులను అడ్డుకునేందుకు రాళ్లు రువ్వారని, కర్రలతో దాడి చేశారని వివరించారు. టీడీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశ్యంతో అధికార పార్టీ గూండాలు టీడీపీఫ్లెక్సీలు,బ్యానర్లను చింపి తగులబెట్టినట్లు తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదే శాలతోనే శాంతిభద్రతల సమస్య సృష్టించారనేది విస్పష్ట మని పేర్కొన్నారు. అధికార పార్టీ గూండాలను అదుపు చేయడంలో,చంద్రబాబు పర్యటనకు ముందస్తు జాగ్ర త్తలు తీసుకోవడంలో పోలీసులు ఘోరంగా వైఫలమైనట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్ ప్రారం భించక ముందే అధికార పార్టీ గూండాలు క్యాంటీన్‌పై దాడి చేసి ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. కుప్పం పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై దాడికి అనుమతించారని స్పష్టంగా తెలియజేస్తోందని తెలిపారు. గతంలో ఎంతో కీర్తి ప్రతిష్ఠలు కలిగిన ఏపీ పోలీసులు కుప్పంలో చట్టాన్ని ఉల్లంఘించడంతో నవ్వుల పాలు అయ్యారన్నారు. రాష్ట్ర ప్రజలలో పోలీ సుశాఖపై విశ్వాసం కలిగించడానికి, శాంతిభద్రతలు, ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు మీకు ఇదే సరైన సమయం అని తెలిపారు. పోలీసుశాఖ పనితీరును ఒకసారి సమీక్షిం చుకుని చట్టం ప్రకారం చర్యలు తీసుకోమని వర్ల రామ య్య డీజీపీకి విజ్ఞప్తి చేశారు.