- జగన్‌రెడ్డి అక్రమాలు, అవినీతిని ఇక సహించేది లేదు
- ఎన్ని ఫిర్యాదులైనా చేస్తూనే ఉంటాం
అమరావతి (చైతన్యరథం): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, అధికార వైసీపీ కోసం బహిరంగంగానే పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ను కోరామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలిపారు కోడ్ ఉల్లంఘిస్తున్న అధికారుల విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు ఉండటం లేదనే విషయాన్ని కూడా సీఈఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు.మంగళవారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో సమా వేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున వర్ల రామయ్య,పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్ హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి ఎన్నో ఫిర్యాదులు చేశామని కానీ నేటకీ వాటిపై చర్యలులేవని తెలిపారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన, బేఖా తరు చేసినవారిపై తక్షణమే చర్యలుతీసుకోవాలని ఎన్ని కల ప్రధానాధికారిని మరోసారి కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారిగా ఉన్న సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి బహిరంగంగా ఎన్ని కల ప్రచారం చేస్తున్నాడు.ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా కూడా అతను బేఖాతరు చేస్తున్నాడు. ఇదే విషయాన్ని సీఈఓకు వివరించాం. విద్యార్థులకు చదు వు చెప్పడం మానేసి వారితో ఎన్నికల సర్వే చేయిస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్‌రెడ్డిపై కూడా ఈసీకి ఫిర్యాదు చేశామని వర్ల తెలిపారు.
సజ్జల భార్గవ్ ఫేక్ ప్రచారంపై..
ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కారును 3 రోజుల్లో 4 సార్లు ఎన్నికల కోడ్ సాకుతో తనిఖీచేశారు.రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో లోకేష్ గెలవబోతున్నాడని తెలిసేసరి కి కావాలని ఆయనను టార్గెట్‌చేశారు. లోకేష్‌బాబు కారులో రూ.8కోట్లు దొరికినట్లు సజ్జల భార్గవ్‌రెడ్డి ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నాడు.దానిమీద పోలీసులకు,రిట ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసి 3రోజులు అవుతోంది. అయినా ఎటువంటి చర్యలుతీసుకోలేదని ఎన్నికల కమి షనర్‌కు మరోసారి ఫిర్యాదు చేశామని వర్ల చెప్పారు.
సీఐపై ఫిర్యాదు
గంగిరెడ్డి అనే పెద్దిరెడ్డి చెంచా…చిత్తూరులో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నాడు. అతను చిత్తూరు రూరల్‌లో 3 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాడని చిత్తూ రు జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తే అతన్ని చిత్తూరు స్పెషల్ బ్రాం చ్‌కు ప్రభుత్వం బదిలీ చేసింది. గతంలో ఇన్‌స్పెక్టర్‌గా కేవలం ఒక్క సర్కిల్‌లో మాత్రమే ప్రభావం చూపేవాడు. నేడు స్పెషల్ బ్రాంచ్‌లో ఉండి వైసీపీని గెలిపించాలని చిత్తూరు జిల్లా మొత్తం తిరుగుతున్నాడు. ఆయనను ఆ విధుల నుంచి తప్పించాలని సీఈసీని కోరామని వర్ల తెలిపారు.
కారంపూడి సీఐ బెదిరింపులు
కారంపూడిలో టీ తాగుతున్న మా టీడీపీ కార్యకర్త లను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చిన్న మల్లయ్య తుపాకీతో బెది రించి, లాటీలతో వాళ్ళని కొట్టి బెదిరించాడు. మాచర్ల లో టీడీపీ ఉండటానికి వీలు లేదనేలా సీఐ వ్యవహారం ఉంది. ఆయనపై చర్చలు తీసుకోవాలి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ వైసీపీ నాయకుడిలా విజయసాయిరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డిలతో కలిసి విలేక రుల సమావేశంలో పాల్గొన్నాడు. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలోని ఓ మసీదులో వైసీపీ ఎమ్మెల్సీ రహుల్లా బహి రంగంగా డబ్బులు పంచుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లిని గెలిపించాలని మసీదులో ప్రచారాలు చేస్తు న్నాడు. ఆధారాలతో సహా రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యా దు చేస్తే..నేనేం చర్యలు తీసుకోలేనని చేతులెత్తేశాడు. కమిషనర్లు కేవలం చోద్యం చేస్తున్నారని సీఈఓ దృష్టికి తీసుకెళ్లామని వర్ల చెప్పారు.
రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరగకూడదని కోర్టు, ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా అధికార పార్టీ వాటిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా సహజ వనరులను దోచేస్తోంది. 3 రోజుల్లో ఆయా జిల్లాల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం చెబితే ఒక్క కలెక్టర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సహజ వనరులను దోచేసి రేపు ఎన్నికల్లో ఆ డబ్బును వాడుకోవాలని వైసీపీ చూస్తోందని సీఈఓకి వివరిస్తే…రేపు కలెక్టర్లతో జరగబోయే వీడియో కాన్ఫరెన్సులో దీనిపై కచ్చితంగా తగిన ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారని వర్ల తెలిపారు.
సానుకూలంగా స్పందించిన సీఈఓ
మేము ఇచ్చిన ఫిర్యాదులన్నింటి మీద సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా వివరణ తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాత్రికేయ మిత్రులు కూడా తమ పరిధిలో ప్రజలను చైతన్యం చేయాలి. అక్రమ, అవినీతి మార్గంలో జగన్ రెడ్డి ఎలా అధికారంలోకి రావాలని చూస్తున్నాడో ప్రజలకు తెలియజేయాలి. జగన్ రెడ్డి అవినీతిని, అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్ని ఫిర్యాదులైనా చేస్తూనే ఉంటాం. ఎన్నికల ఎప్పుడూ వస్తాయా ఎప్పుడు రాక్షస పాలనకు ముగింపు పలుకుదామా, ఎప్పుడు అవినీతి పరిపాలనకు అంతం పలుకుదామా అని ప్రజలు వేచి ఉన్నారని వర్ల స్పష్టం చేశారు.