అమరావతి(చైతన్యరథం): ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులుపై దాడి చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి గురువారం లేఖ రాశారు. ప్రత్తిపాడు వైకాపా అభ్యర్థి బాలసాని కిరణ్‌కుమార్ వాలంటీర్లతో సమావేశాలు పెడుతూ ఎన్నికల నియమా వళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని లేఖ లో పేర్కొన్నారు. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయినా పోలీసులు ఆయన పట్ల ఎక్కడాలేని వినయ, విధేయతలు ప్రదర్శిస్తు న్నారు. కిరణ్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన రోజు కొంతమంది పోలీసులు వెళ్లి ఆయనకు పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీఓ ఆఫీసులో సైతం లబ్ధిదారులకు ఈయన చేతే చెక్కులు ఇప్పించారు. అటు తర్వాత స్వయం సహా యక బృందాల మహిళలకు చీరలు, గిప్టులు పంపిణీ చేశాడు.
ఈ నెల 20వ తేదీన కిరణ్‌కుమార్ తన ఇంట్లో ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండ లాలలకు చెందిన వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు అక్కడకు వెళ్లారు.వాలంటీర్లను ప్రలోభపెట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘించవద్దని హితవు చెప్పిన రామాంజనేయులుపై కిరణ్‌కుమార్ తన గూండాలతో దాడి చేయించాడు. బౌతిక దాడులకు పాల్పడిన వారిపై తగుచర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.