- ఆయన నుండి కార్యకర్తలను ఎవరూ దూరం చేయలేరు
- ఆయన తపనంతా యువత భవిష్యత్ కోసమే
- పారదర్శకంగా పోలింగ్ జరిగేలా చూసే బాధ్యత యువతదే
- కుప్పంలో సైకిల్ యాత్ర చేసిన యువకులకు భువనమ్మ అభినందన
కుప్పం: టీడీపీ కార్యకర్తలను పార్టీ అధినేత చంద్రబాబు నుండి ఎవరూ వేరు చేయలేరని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబుకోసం కుప్పం నియోజకవర్గంలో 23 రోజులు సైకిల్ యాత్ర చేసిన యువకులకు భువనమ్మ బుధవారం అభినందించారు. వారికి హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా కుప్పం యువతను ఉద్దేశించి భువనమ్మ మాట్లాడుతూ చంద్రబాబు కోసం 23రోజులు సైకిల్ యాత్ర చేయడం చాలా అభినందనీయమన్నారు. మిమ్మల్ని చంద్రబాబు నుండి ఎవరూ వేరు చేయలేరన్నారు. మీ సహకారంతోనే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కి ఎన్నో కార్యక్రమాలు చేయగలిగారు. టీడీపీ కార్యకర్తలే చంద్రబాబుకి కొండంత బలం, ధైర్యం. మీకోసం, మీ భవిష్యత్తుకోసం ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మాకు, చంద్రబాబుకి పదవులపై ఆశ లేదు… యువత భవిష్యత్తును నిలబెట్టాలనేదే చంద్రబాబు ఆశ. మీ భవిష్యత్ కోసం రాబోయే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించుకునే బాధ్యత యువతపైనే ఉంది. యువత చేతిలోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంది.. పోరాడి అయినా యువత ఎన్నికల్లో నిజాయితీగా పోలింగ్ జరిగేలా చూడాలి. పోలింగ్‌బూత్‌ల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలి. ద్విచక్ర వాహనాలు నడిపే యువత హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి.. అలాగే హెల్మెట్‌కి ఉన్న క్లిప్ కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి. యువత దేశానికి చాలా అవసరం… దేశం కోసం యువత నిలబడాలి.. ప్రాణాలను నిర్లక్ష్యం చేయకూడదని భువనేశ్వరి హితవు పలికారు.