- అన్ని విధాలా అండగా ఉంటాం
- ఇబ్బందుల్లో తోడుంటాం
- కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
- అనంతపురం జిల్లాలో ‘నిజం గెలవాలి’
- ఐదు కుటుంబాలకు పరామర్శ
- రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేత
అనంతపురం(చైతన్యరథం): టీడీపీకి ప్రాణంలాంటి కార్యకర్తలకు,వారి కుటుంబాలకు కష్టంవస్తే ఆదుకోవటానికి ఎంత దూరమైనా వెళతామని పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కార్య కర్తలు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవటం తమ కర్తవ్యం అన్నారు. వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగం గా బుధవారం ఆమె అనంతపురం జిల్లాలో పర్యటించా రు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పి, ఆర్థికసాయం అందించేందుకు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో ఐదుగురు కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరా మర్శించారు. మృతి చెందిన కార్యకర్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యకర్తల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
తొలుత అనంతపురం నియోజకవర్గం, అనంతపురం టౌన్ 28వ డివిజన్‌లో గత ఏడాది అక్టోబర్ 16న గుండెపోటుతో మృతిచెందిన డేరంగుల వెంకటమ్మ (70) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం కళ్యాణదుర్గం నియోజకవర్గం, కళ్యాణదుర్గం రూరల్ మండలం, ఎం.కొండాపురం గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 15న గుండెపోటుతో మృతిచెం దిన దొడ్డి నారాయణప్ప(65) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. తరువాత కళ్యాణదుర్గం అదే మండ లం, ముద్దినాయనపల్లి గ్రామంలో గత ఏడాది సెప్టెం బర్ 11న మృతిచెందిన తలారి శ్రీరాములు(65) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం ఆ మండలంలోనే ఎం.కొత్తూరు గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 9న మృతి చెందిన పోతురాజుల పోతన్న (63) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చివ రగా రాయదుర్గం నియోజకవర్గం, కనేకల్ మండలం, గోపాలాపురం గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 11న మృతి చెందిన తలారి వన్నూరప్ప (50) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.