అమరావతి(చైతన్యరథం): విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ను అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరన్ అదానీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సాయం అందించినందుకు కరన్ అదానీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను కరన్ అదానీ కు వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్‌తో అన్న కరన్ అదానీ స్పష్టం చేశారు.