అమరావతి(చైతన్యరథం): మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. తన వద్దకు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరిస్తూ.. వీలైతే అక్కడికక్కడే పరిష్కరిస్తూ మంత్రి లోకేష్ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. వాట్సాప్, ట్విట్టర్ ద్వారా అందిన వినతులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకుసాగుతున్నారు. తాజాగా ప్రజాదర్బార్‌లో వివిధ వర్గాల ప్రజల నుంచి తన వద్దకు వచ్చిన వినతులను బుధవారం క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడానికి ముందు సంబంధిత మంత్రులకు లోకేష్ అందజేశారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అనంతరం క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు.