చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..సూత్రధారులెవరో తేలాలి!

విచారణ కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం

by చైతన్యరధం
Feb 4, 2026 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..సూత్రధారులెవరో తేలాలి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టెండర్ నిబంధనల సడలింపుతో ఆక్రమాలకు గేట్లు తెరిచారు
  • తప్పు జరుగుతోందని తెలిసినా మౌనంగా నాటి ప్రభుత్వ పెద్దలు
  • నెయ్యి కల్తీని తీవ్రంగా పరిగణిస్తూ దోషులపై కఠిన చర్యలు
  • తిరుమల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ కర్తవ్యం
  • ఆజెండా అంశాలు పక్కనబెట్టి సిట్ నివేదికపై క్యాబినెట్‌లో సుదీర్ఘ చర్చ
  • వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్

అమరావతి (చైతన్యరథం): కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైవున్న తిరుమల తిరుపతి దేస్థానం పవిత్రతను కాపాడటం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీని తీవ్రంగా పరిగణిస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షించి సత్వరమే తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు స్వల్పకాలిక విచారణ కమిటీని ప్రభుత్వం నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణ నివేదికలో పాత్రధారులపైనే చర్యలకు చేసిందని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడిందన్నారు. అసలు సూత్రధారులను కనుగొనే బాధ్యతను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో సహచర మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడారు. క్యాబినెట్ సమావేశంలో అజండా అంశాలను పక్కనబెట్టి మరీ తిరుమల లడ్డ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జరిగిన కల్తీపై ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన నివేదికపై సమగ్రంగా చర్చించామన్నారు.

ఎన్‌డీబీబీ నివేదిక ఆధారంగానే..
శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీపై ఏ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడారో అర్థం చేసుకోవాలి. గతంలో నెయ్యి నమూనాలను పరిశీలించిన చీణణదీ-్పుALఖీ ల్యాబ్ నివేదికలో పలు సస్పెక్టెడ్ అడల్ట్రెంట్స్ (కల్తీ పదార్థాలు) సోయాబీన్, సన్‌ఫ్లవర్, రేప్ సీడ్, కాటన్‌సీడ్, ఫిష్ ఆయిల్, పందికొవ్వు మొదలైనవి ఉన్నట్లు తేల్చిందన్నారు. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో ప్రజా వేదికపై ఈ అంశాన్ని ప్రస్తావించారన్నారు. తెలిసిన వాస్తవాలను సీఎం

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం

ప్రజల ముందు పెట్టాలా.. వద్దా?
తదనంతరం నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో ఏర్పాటైన సిట్ విచారణ జరిపి నివేదికను సమర్పించిందన్నారు. సిట్ నుండి ప్రభుత్వానికి రెండు పత్రాలు అందాయని, వాటిలో ఒకటి ఇప్పటికే కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్ కాగా మరొకటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా పంపిన 11 పేజీల గోప్య నివేదిక అని తెలిపారు. చార్జ్‌షీట్‌ను కోర్టు అధికారికంగా పరిగణన లోకి తీసుకున్న తర్వాతనే అది ప్రభుత్వానికి, సంబంధిత కక్షిదారులకు అందుబాటులోకి రానుందన్నారు.

నిబంధనల సడలింపుతోనే..
క్యాబినెట్ ముందు ఈ నివేదికను ఉంచి, అందులో పేర్కొన్న ప్రధాన అంశాలు, తేలిన లోపాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగిందన్నారు. ప్రభుత్వానికి అందిన నివేదిక ప్రకారం నెయ్యి సరఫరా టెండర్ నిబంధనల సడలింపు, నాణ్యత లోపాలు, తప్పుడు పత్రాల సమర్పణ వంటి తీవ్రమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందన్నారు. సిట్ నివేదిక ప్రకారం.. 2019 తర్వాత టీటీడీ నెయ్యి కొనుగోలు విధానంలో అనవసరమైన సడలింపులు చేయడం ద్వారా నాణ్యతా లోపంతో సరఫరాలు జరగడానికి అవకాశం ఏర్పడిందన్నారు. టెండర్ నిబంధనల్లో రూ.250 కోట్ల టర్నోవర్ నిబంధనను రూ.150 కోట్లకు తగ్గించడం, కనీస పాల సేకరణ అనుభవం లేకున్నా అర్హత కల్పించడం వంటి చర్యలు ఉద్దేశపూర్వకంగా తీసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసిందన్నారు. నెయ్యి సరఫరా నిబంధనలు సడలించి మరీ అక్రమాలకు గేట్లు తెరిచారని ఆరోపించారు. టెండర్‌లో పాల్గొన్న కొన్ని సంస్థలు తప్పుడు పత్రాలు సమర్పించి అర్హత పొందినట్లు స్పష్టమైందన్నారు. సుమారు రూ.58 లక్షల లీటర్ల వరకు కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు నివేదికలో వెల్లడించారన్నారు.

2022లో సీఎఫ్టీఆరఐ ల్యాబ్ ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోలేదన్నారు. ఆ నివేదికను కావాలనే తొక్కి పెట్టారని మండిపడ్డారు. టెండర్ నిబంధనల సడలింపు, నాణ్యత నియంత్రణలో వైఫల్యానికి ఏ.వి. ధర్మారెడ్డి (అప్పటి ఏఈఓ), అనిల్‌కుమార్ సింఘాల్ (అప్పటి ఈఓ), ఓ. బాలాజీ (ఎఫఏ, సీఏఓ) వంటి సీనియర్ అధికారులు బాధ్యులుగా సిట్ నివేదికలో పేర్కొన్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినందున రిపోర్టులో ఉన్నవారందరికీ నేరంలో భాగం ఉన్నట్లేనని అభిప్రాయపడ్డారు. నివేదికలో పేర్కొన్న దోషులపై తగిన చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు చెప్పారు.

తిరుమలలో ఇన్ని తప్పులు జరుగుతుంటే గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని పయ్యావుల ప్రశ్నించారు. ఈ తప్పుల్లో వారు భాగస్వాములుగా ఉన్నారని ఆధారాలు చెబుతున్నాయన్నారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావతం కాకుండా సంస్థాగత సంస్కరణలు, నాణ్యత నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షించడానికి ఒక స్వల్పకాలిక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ కమిటీ నిర్ణీత కాలవ్యవధిలో విచారణ పూర్తి చేసి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని మంత్రి తెలిపారు. శ్రీవారు కొలువైన తిరుమల క్షేత పవిత్రత, భక్తుల విశ్వాసాలు ఏ విధంగానూ దెబ్బతినకూడదనేదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడుతూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ ఏకగ్రీవంగా అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు.

క్యాబినెట్‌లో సుదీర్ఘ చర్చ: మంత్రి పార్థసారథి
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కల్తీ నెయ్యి అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి పవిత్రతను కాపాడటం, హిందూ భక్తుల విశ్వాసాన్ని రక్షించటం ప్రభుత్వ ధర్మమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. సిట్ నివేదికలో పేర్కొన్న అంశాలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరగగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరూ తమ తమ అభిప్రాయాలను వివరించారన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని మంత్రి తెలిపారు.

రాజకీయ కోణంలో వక్రీకరించే ప్రయత్నాలు: మంత్రి నాదెండ్ల మనోహర్
కల్తీ నెయ్యిపై క్యాబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ అంశంపై సిట్ సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించామన్నారు. అసలైన నెయ్యి చుక్క కూడా లేకుండా పూర్తిగా రసాయనాలతో తయారుచేసిన కత్రిమ నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వినియోగించినట్లు నివేదిక వెల్లడించిందని మంత్రి స్పష్టం చేశారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు తీవ్ర భంగం కలిగించే అంశమని ఆయన అన్నారు. క్యాబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సహా మంత్రులందరూ భక్తుల మనోభావాలను కాపాడే దిశగా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో వక్రీకరించే ప్రయత్నాలను నిరసిస్తూ, ప్రజలకు వాస్తవాలను పారదర్శకంగా తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సమావేశానికి అడ్వకేట్ జనరల్‌ని ఆహ్వానించి చట్టపరమైన సలహాలు తీసుకున్నామన్నారు. భక్తుల విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలనే దృఢసంకల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారన్నారు. గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశాలను బయటపెట్టి, ప్రస్తుత ప్రభుత్వం నెయ్యి నాణ్యతపై పలు మార్లు ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తూ పారదర్శకతతో చర్యలు తీసుకుంటోందని వివరించారు. భవిష్యత్తులో ఎవరు తప్పు చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని, శ్రీవారి పవిత్రతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని క్యాబినెట్ ఏకాభిప్రాయంగా నిర్ణయించిందని ఆయన తెలిపారు.

పాలు లేకుండానే నెయ్యి: మంత్రి సత్యకుమార్ యాదవ్
వైసీపీ పాలనలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో రూ.250 కోట్ల మేర అవినీతి జరిగిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. కల్తీకి పాల్పడడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్ధసారధిలతో కలిసి మీడియా సమావేశంలో వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు.

తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది కానీ, జంతుకొవ్వు కలవలేదని వైసీపీ వారంటున్నారన్నారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారంటే, దానిని వైసీపీ నేతలు సమర్థిస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డులో కల్తీ జరిగిందని మీరు అంగీకరిస్తున్నారా? దాన్ని వైసీపీ నాయకత్వం సమర్థిస్తున్నదా.. సమాధానం చెప్పాల్సిందేనని మంత్రి సత్యకుమార్ డిమాండ్ చేశారు. పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేయించడం ద్వారా వైసీపీ వారు బరితెగించారన్నారు. జగన్ హయాంలో అన్యమతస్తులను తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించారన్నారు. అన్నమతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తే, డిక్లరేషన్ ఇవ్వాలన్న నియమాన్ని కూడా ఉల్లంఘించారన్నారు. కల్తీ జరిగిందని వైసీపీ హయాంలో సీఎఫ్‌టీఆరఐ రిపోర్టు స్పష్టం చేసినా తుంగలో తొక్కారన్నారు. హిందూ ధర్మం మూలాల్ని దెబ్బతీసేలా ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మంత్రి దుయ్యబట్టారు. కావాలనే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

నేడు వాస్తవాలు బయటపడుతున్న క్రమంలో ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంగా కాకుండా, దీన్ని కూడా రాజకీయ అంశంలాగా చేసి, వితండవాదం చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు “ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు.
కల్తీకి కారణమైన రసాయనాన్ని పరీక్షించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పినా, అందుకు విరుద్ధంగా కావలసిన కంపెనీలకు కట్టబెట్టే ఉద్దేశంతో టెండర్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చారు. దీని వెనుక దురుద్దేశం ఉందనే విషయం స్పష్టమవుతోంది. అన్ని తెలిసే ఉద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడి ఆలయ పవిత్రత కూడా దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు. ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కేఎంఎఫ్ సంస్థ రోజుకు కోటి లీటర్ల పాలను సేకరిస్తుంది. అటువంటి సంస్థను కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. ఎవరికీ తెలియని ఈ బోలే బాబా డైరీని దొడ్డిదారిలో తీసుకొచ్చారు. ఈ బోలే బాబా డైరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తెలియాల్సి ఉంది. సీబీఐ పంపించిన 11 పేజీల రిపోర్ట్‌పై క్యాబినెట్‌లో చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ఏరకమైన చర్యలు తీసుకోవాలో చర్చించాం. ఏ స్థాయిలో వ్యక్తులున్నా ఉపేక్షించకూడదు. సప్లిమెంటరీ చార్ట్ షీట్ లో వచ్చే అంశాల బట్టి ఏవిధంగా ముందుకెళ్లాలో అన్న విషయాన్ని క్యాబినెట్‌లో చర్చించాం. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు వైసీపీకి అలవాటైనవే కాబట్టి… ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

Previous Post

బీసీ హాస్టళ్ల మరమ్మతులకు మరో రూ.20 కోట్లు

Next Post

రాయచోటిలో అభివృద్ధి కార్యక్రమాలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026

కార్యకర్త
@ February 5, 2026
మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు
ఆంధ్రప్రదేశ్

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

చైతన్యరధం
@ February 5, 2026
చివరి ఆయకట్లు వరకూ సాగునీరు
ఆంధ్రప్రదేశ్

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం

చైతన్యరధం
@ February 5, 2026
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్
ఆంధ్రప్రదేశ్

డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

చైతన్యరధం
@ February 5, 2026
మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు
ఆంధ్రప్రదేశ్

మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

చైతన్యరధం
@ February 5, 2026
ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం
ఆంధ్రప్రదేశ్

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

చైతన్యరధం
@ February 5, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-02-2026

కార్యకర్త
@ February 4, 2026
నిరుద్యోగులకు జీఎస్టీ ఫైలింగ్‌పై శిక్షణ
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు జీఎస్టీ ఫైలింగ్‌పై శిక్షణ

చైతన్యరధం
@ February 4, 2026
Load More

ముఖ్య వార్తలు

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

చైతన్యరధం
@ February 5, 2026
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..సూత్రధారులెవరో తేలాలి!

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..సూత్రధారులెవరో తేలాలి!

చైతన్యరధం
@ February 4, 2026
అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

చైతన్యరధం
@ February 4, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

చైతన్యరధం
@ February 5, 2026
చివరి ఆయకట్లు వరకూ సాగునీరు

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం

చైతన్యరధం
@ February 5, 2026
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

చైతన్యరధం
@ February 5, 2026
మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

చైతన్యరధం
@ February 5, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist