టిడిపి అధికారంలోకి వచ్చాక ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం కర్నూలు అశోక్ నగర్ లో టిఎన్ టియుసి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జీవో.నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందించాలి. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను పునరుద్ధరించి, పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెచ్చి విద్యా కానుక, యూనిఫామ్ ను పూర్తి స్థాయిలో అందిరికీ అందించాలి.
పాఠశాల విలీన ప్రక్రియకు సంబంధించి జోవోలు 84, 85, 117, 128ని రద్దు చేయాలి. సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతోపాటు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.3లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలి. ఏటా జాబ్ కేలండర్ విడుదల చేయాలి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవిద్యార్థులకు విద్యను దూరం చేసేవిధంగా తప్పుడు విధానాలను అవలంభిస్తున్నాడు.
పీజీ విద్యార్థులకు విద్యను దూరం చేసే జిఓ 77ని రద్దుచేసి, పాత ఫీ రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలులోకి తెస్తాం. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం పేరుతో భూముల్ని దోచుకునేందుకు ప్రయత్నించారు. హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపర్చి, నాణ్యమైన విద్యను అందిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీ పోస్టులన్నీ భర్తీచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.