రాష్ట్రంలో వైసిపి అధికారం చేపట్టాక అభివృద్ధి శూన్యం అని అమలాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. గురువారం అల్లవరం మండలంలోని మొగళ్ళమూరులో నిర్వహించిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వివరించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.