- ఆధారాల్లేకుండా చంద్రబాబుపై తప్పుడు కేసులు
- హైకోర్టులో చీవాట్లు, సుప్రీంకోర్టులో మొట్టికాయలు జగన్‌కు మామూలే
- జగన్ ప్రభుత్వ చర్యలతో వందల కోట్ల ప్రజాధనం వృథా
అమరావతి: చంద్రుడికి పట్టిన గ్రహణం వీడినట్లే టీడీపీ అధినేత చంద్రబాబుకు పట్టినగ్రహణాలు కూడా త్వరలోనే వీడిపోతాయని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు ఆశాభావం వ్యక్తంచేశారు. మంగళగిరిలో ని టీడీపీ జాతీయకార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రుడికి,సూర్యుడికి గ్రహణాలు పట్టడం సహజం.. ఆ తర్వాత ఆ గ్రహణాలు వీడిపోతాయన్నారు. అలాగే చంద్రబాబునాయుడి మీద జగన్మోహన్‌రెడ్డి పెట్టిన కేసు లన్నీ ఈ గ్రహణాల మాదిరిగా ఒక్కొ క్కటి విడిపోతున్నా యి. ఇన్నర్ రింగురోడ్డు కేసులో చంద్రబాబుకు హై కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్‌ని రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్టు ప్రభుత్వానికి చీవాట్లుపెట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ కేసులో అసలు 420 సెక్షన్ అమలు కాదు..ఏపీ ప్రభుత్వం ఏ విధంగా బెయిల్ రద్దుచేయాలని కోరుతోందని.. ఇలా కొన్ని ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ముందస్తు బెయిల్ రద్దు కోసం వేసిన పిటిషన్‌ని సుప్రీం కోర్టు తిరస్కరించింది.ఇప్పటి కైనా ప్రభుత్వానికి, జగన్ కు బుద్ది రావాలి. జగన్ ఒక సైకో లాగ వ్యవహరిస్తు న్నాడని అశోక్‌బాబు మండిపడ్డారు.
ఒక్క కేసులో కూడా సాక్ష్యాలు చూపలేకపోయారు..
చంద్రబాబుపై అనేక అక్రమ కేసులుపెట్టారు. వాటి ల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఒకటి. ఇందులో మొదట రూ. 3 వేల కోట్ల అవినీతి అన్నారు. చివరికి 25 కోట్లు తెలుగుదేశం పార్టీ ఫండ్‌గా వచ్చిందన్నారు. స్కిల్ డెవ లప్‌మెంట్,లిక్కర్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఇసుక, ఫైబర్ నెట్ ఇలా ఒక్క కేసులో కూడా ఆధారాలు చూప లేక పోయారు. ఎంత మేర అవినీతి జరిగిందని ప్రభుత్వాన్ని కోర్టు స్పష్టంగా అడిగితే సమాధానం చెప్పలేక పోయా రు. ఆధారాలున్నాయి కాబట్టి చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. కోర్టులు అడితే మాత్రం చూపించలేకపోతున్నారు. జగన్‌పై ఉన్న అన్ని కేసులకు ఆధారాలున్నాయి. చంద్ర బాబుపై ఉన్న కేసుల్లో ఒక్క ఆధారం కూడా లేదు. జగన్‌పై ఉన్న లక్ష కోట్ల అవినీతి కేసుపై.. ఇంత పెద్ద అవినీతిని ఎప్పుడూ చూడలేదని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించిందని అశోక్‌బాబు చెప్పారు.
వందల కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్లి భంగపడ్డాడు..
చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని వందల కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో మొట్టికాయలు పడినా సిగ్గురాలేదు. ప్రభుత్వ సొమ్ము మీ అబ్బ సొమ్ముగా భావించొద్దు. సుప్రీంకోర్టుకు వెళ్లే అధికారాన్ని జగన్‌కు ఎవరిచ్చారు? దానికి ఒక జ్యుడి షియల్ రివ్యూ ఉంటుంది. టెండర్లకు జ్యుడిషియల్ రివ్యూ పెట్టే జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లేటప్పుడు జ్యుడిషి యల్ రివ్యూ ఎందుకు పెట్టడంలేదు? చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయి ల్ ఇస్తే దాన్ని రద్దు చేయడం కోసం కక్ష పూరితంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యక్తి జగన్ అని అశోక్‌బాబు విమర్శించారు.
ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం..
ఏసీబీ కేసులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయ కుడు సూర్యనారాయణతో పాటు ఐదుగురిపై జగన్ కేసు పెట్టారు.ఒక్కరిని మాత్రమే అరెస్టు చేయగలిగారు. సూర్యనారాయణను అరెస్టు చేయలేదు. దాదాపు రెండు నెలలపాటు అతను దొరకలేదు. జగన్ ప్రభుత్వ అసమ ర్థత ఈ విషయంలో బయటపడు తోంది. ఒక ఉద్యో గిని పట్టుకోవడం చేతకాలేదు. అతను సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. మీ ప్రభుత్వానికి ఆ స్టేను తొలగించడం చేతకా లేదు.ఈలోపు అతను రెగ్యు లర్ బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ కేసులో గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? తెలుగుదేశం నాయకులు, కార్య కర్తలపై జగన్ చేసిన అరాచకం,పెట్టిన అక్రమ కేసులు అన్నీ ఇన్నీ కావు. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే శ్రీకాకుళం నుంచి కర్నూలు దాక తీసు కెళ్లారు. వారిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. ఇవన్నీ టీడీపీ మరచిపోదు. జూన్ 2019నుంచి జగన్ చేసిన అరాచ కాల చిట్టా మా వద్ద ఉంది. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. చంద్రబాబుపై పెట్టిన కేసులతో సాధించిం దేమీ ఉండదు. 17ఏ మీద సుప్రీంకోర్టు విస్తృత ధర్మా సనం తీర్పు ఇస్తే తప్ప దానిమీద జగన్ రైటా.. మేం రైటా అనేది తేలదు. మీ జీవితకాలం ప్రయత్నించినా చంద్రబాబును దోషిగా నిరూపించలేరని అశోక్‌బాబు స్పష్టం చేశారు.
హైకోర్టులో చీవాట్లు తినడం, సుప్రీంకోర్టుకు వెళ్లడం జగన్‌కు మామూలే..
ప్రతి చిన్న కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లే జగన్ తన కేసుల్లో ఎందుకు 3 వేల వాయిదాలు తీసుకున్నాడు? హైకోర్టులో చివాట్లు తినడం సుప్రీం కోర్టుకు వెళ్లడం జగన్ కు ఆనవాయితీగా మారింది. కోడికత్తి కేసు అతి భయంకరమైంది. ఈ కేసులో 5 సంవత్సరాలు దాటినా నిందితుడికి బెయిల్ రాలేదు. ఇందుకు కార ణం జగన్ కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పక పోవటమే. ఇంతలా దయాదాక్షిణ్యాలు లేని వ్యక్తి ఎవరూ ఉండ రు. కొలం బియాలోని డ్రగ్ మాఫియా వారే జగన్ కన్నా కొంత మేలు.
ఎంత పెద్దపాపాలు చేసినా ఆరు నెలలకో, సంవత్సరానికో వారు లొంగిపోయి చేసిన పాపాలు చెప్పేవాళ్లు. జగన్ వీరికన్నా మరింత కర్కో టకుడని అశోక్‌బాబు అన్నారు.