గత మూడు రోజులుగా.. కృష్ణమ్మ వరదలో చిక్కుకున్న బాధితుల రక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి మీడియాతో మాట్లాడిన అనంతరం.. నాలుగ్గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన సాగించారు. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వదర కాలనీల్లో పర్యటించి.. బాధితులకు సహాయ కార్యక్రమాలు సరిగ్గా అందుతున్నాయో లేదో పర్యవేక్షించారు. మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా వరద ప్రాంతాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తూ.. ప్రజల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితిని పరిశీలిస్తున్న సీఎం, అక్కడినుంచే తదుపరి చేపట్టాల్సిన పనులపై ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఆహారం అందుతుందా లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయని వెల్లడిరచారు. జేసీబీపై స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి చేరుకుంటారో చెప్పకపోవడంతో పాయింట్ టూ పాయింట్ సీఎం కాన్వాయ్ మారుతూ.. సీఎంను ఫాలో అవుతోంది.