- అన్ని రాజకీయపక్షాలు, మహిళాసంఘాలకు ఆహ్వానం
- భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తాం
- తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
- అమరావతి: యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తలదించుకునేలా చేసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వికృత చేష్టలు, న్యూడ్ వీడియోకాల్స్, రాష్ట్ర మహిళలకు కరువవుతున్న రక్షణ, గత మూడేళ్లుగా రోజురోజుకూ పెరుగుతున్న మహిళల నిర్బంధాలు, అక్రమ కేసులు, వేధింపులు తదితర అంశాలపై జగన్ రెడ్డి అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై గళమెత్తేం దుకు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈనెల 9న విజయవాడలోని స్వర్ణ హోటల్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ హించనున్నట్లు తెలుగు మహిళ రాష్ట్ర అధ్య క్షురాలు వంగలపూడి అనిత ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా అన్ని మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధుల హజరై రాష్ట్రంలో మహిళలపై కొనసాగుతున్న అరాచకపర్వంపై తమ అభిప్రాయాలను వెల్లడిరచాల్సిందిగా ఆమె కోరారు. ఈ సమావేశంలో మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నామని, కార్యక్రమంలో మహిళలపక్షాన ఉద్యమించే నేతలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.